Homeఆంధ్రప్రదేశ్‌Nagababu: నాగబాబు కు షాక్ లాగా.. మంత్రి పదవి ఇప్పుడే కాదట

Nagababu: నాగబాబు కు షాక్ లాగా.. మంత్రి పదవి ఇప్పుడే కాదట

Nagababu: నాగబాబుకు( Nagababu ) మంత్రి పదవి ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా? లేకుంటే జూన్ లో పదవి ఇస్తారా? లేకుంటే మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు ఏ సభలోను సభ్యుడు కారు. అందుకే ముందుగా ఎమ్మెల్సీ ని చేసి.. ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు అన్నది ప్రశ్న.

Also Read: ఢిల్లీలో పయ్యావుల పడిగాపులు.. కొత్త అప్పుల కోసం తంటాలు!

 

* బిజెపికి అవకాశం
అయితే మరోవైపు బిజెపికి ( Bhartiya Janata Party)ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. సంఖ్యాబలం బట్టి తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని బిజెపి పట్టుబడుతోంది. బిజెపికి ఒకే ఒక మంత్రి పదవి కేటాయించారు. కానీ ఆ పార్టీ నుంచి దాదాపు 8 మంది గెలిచారు. సుజనా చౌదరి తో పాటు విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి ఆశిస్తున్నారు. క్యాబినెట్ లో ఉన్నది ఒకే ఒక్క మంత్రి పదవి. అందుకే ఆ పదవి జనసేనకు ఇవ్వాలా? బిజెపికి ఇవ్వాలా? అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.

* కొద్దిరోజుల పాటు ఆగిన తర్వాత
అయితే నాగబాబు ఎమ్మెల్సీ ( MLC )అయ్యారు. ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి. అయితే అది ఇప్పుడు ఇస్తారా? కొద్ది కొద్ది రోజులపాటు ఆగిన తర్వాత ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు పదిమంది కొత్తగా గెలిచినవారే. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అప్పట్లో సీనియర్లకు అవకాశం కల్పించి జూనియర్లకు పక్కన పెడతారని కూడా టాక్ నడుస్తోంది. అయితే అంతవరకు మంత్రి పదవి అందని ద్రాక్షగా ఉంటుందన్నది ఒకసారి కొత్త టాక్.

* విస్తరణ వరకు ఆగాల్సిందే
నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పదవీకాలం ఆరేళ్లు. అందుకే మంత్రివర్గ విస్తరణ వరకు ఆయనకు వెయిట్ చేయిస్తారని తెలుస్తోంది. అప్పట్లో 25 మంది మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసన చెబుతారని.. వారి బదులు సీనియర్లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ లెక్కన నాగబాబు అప్పటివరకు ఆగాల్సిందేనని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper