spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Political Comparison: మూడు రాజధానులతో జగన్.. మూడు పార్టీలతో పవన్.. వైరుధ్యం అదే

Andhra Pradesh Political Comparison: మూడు రాజధానులతో జగన్.. మూడు పార్టీలతో పవన్.. వైరుధ్యం అదే

Andhra Pradesh Political Comparison: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు( CM Chandrababu) తర్వాత ఎవరు అంటే కచ్చితంగా జగన్, పవన్, లోకేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆ ముగ్గురు ఎవరికి వారే ముద్ర చూపుకున్నారు. అయితే ప్రధానంగా జగన్ తో పాటు పవన్ రాజకీయ పార్టీలు ప్రారంభించి తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలది విభిన్నం. ఇద్దరూ తలోదారి తో ముందుకు సాగుతున్నారు. ఒకరు ఓటమితో ప్రస్థానాన్ని ప్రారంభించి.. గెలుపును అందుకున్నారు. మరొకరు విపరీతమైన సెంటిమెంట్ ప్రభావంతో గెలుపును అందుకొని.. భారీ ఓటమి మూటగట్టుకున్నారు. ఇద్దరికీ స్పష్టమైన తేడా ఉంది. అయితే పవన్ ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేస్తుండగా.. జగన్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.

Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో

* సులువుగా పొలిటికల్ ఎంట్రీ..
వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పొలిటికల్ ఎంట్రీ అదుర్స్ అనిపించారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). తండ్రి అకస్మిక మరణంతో వచ్చిన సెంటిమెంటును గుర్తించి ఓదార్పు యాత్రతో తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే ఒక రకమైన దూకుడు రాజకీయాన్ని అలవాటు చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత పూర్తిగా పొలిటికల్ సీన్ మారిపోయింది. అప్పటివరకు ఉన్న రాజకీయ హుందాతనం పూర్తిగా మారిపోయింది. రాజకీయ వికృత క్రీడతో వ్యక్తిత్వ హరణం మొదలైంది అప్పటి నుంచే.

* మహిళల కు అగౌరవం..
అసలు రాజకీయాలతో సంబంధం లేని మహిళలను రాజకీయ వేదికలు ఎక్కించారు. వారితో సాటి మహిళలను ఆ గౌరవంగా మాట్లాడించారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన చట్టసభల్లో మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యాఖ్యానాలు చేశారు. రక్త సంబంధాలు, కుటుంబ సభ్యుల హత్యలను కూడా రాజకీయానికి వాడుకోవచ్చు అని నేటి తరానికి చేసి చూపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకే ఒక్క ఛాన్స్ అవకాశం ఇస్తే రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేస్తానని చేసి చూపించారు జగన్. అధికారం అనేది ప్రజల ప్రగతి కోసం కాదు.. ప్రత్యర్థి నేతల రాజకీయ కక్ష సాధింపుల కోసమని భావించారు జగన్మోహన్ రెడ్డి.

* ప్రజా గొంతుకగా..
పవన్ కళ్యాణ్( Pawan Kalyan) జనసేన ప్రస్థానాన్ని పరిశీలిస్తే మాత్రం.. తాము అధికారం కోసం కాదు ప్రజల గొంతుకై పని చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎన్నెన్నో అవమానాలు, మరెన్నో అవహేళనలు ఎదుర్కొని.. మూడు పెళ్లిళ్లు అనే వ్యక్తిగత దాడిని భరిస్తూ.. ఓటమి అనే భారాన్ని అధిగమిస్తూ ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. 100% సాలిడ్ గెలుపుతో.. అధికారం ఎవరి సొత్తు కాదు అని తేల్చి చెప్పారు. రాష్ట్ర బాగు కోసం తన స్థాయిని తగ్గించుకున్నారు. రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం తన పార్టీ స్థానాన్ని కూడా తగ్గించుకొని మరి నెగ్గారు పవన్. అనుభవానికి పెద్ద పీట వేస్తూ చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టారు. ప్రభుత్వం అంటే అందలం ఎత్తడం కాదు.. ప్రజల కోసం పనిచేయడం అని చాటి చెప్పారు. జగన్ మూడు రాజధానులతో ప్రాంతాలను, ప్రజలను విడగొడితే.. పవన్ మాత్రం మూడు పార్టీలతో జత కలిసి ఈ రాష్ట్ర భవితను మారుస్తున్నారు. అందుకే ఆ నేతలు ఇద్దరి మధ్య వైరుధ్యం పై మేధావులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పై సినీ అభిమానమే ఉండేది. కానీ మేధావులతో పాటు తటస్థుల అభిమానాన్ని పొందుతున్నారు తన చర్యలతో పవన్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular