spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan gives posts to all YCP Leaders: వైసీపీలో అందరికీ పదవులు.. ఇక జనంలోకి...

Jagan gives posts to all YCP Leaders: వైసీపీలో అందరికీ పదవులు.. ఇక జనంలోకి జగన్!

Jagan gives posts to all YCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)గట్టి వ్యూహంతోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్. లేకుంటే ప్రమాదంలో పడినట్టే. అందుకే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. వారంలో మూడు రోజులపాటు తాడేపల్లి నివాసంలో గడుపుతున్నారు. నాలుగు రోజులపాటు బెంగళూరులోని ఎలాహంక ప్యాలెస్ లో ఉంటున్నారు. అయితే పక్కా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడం పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. ముఖ్యంగా బూత్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో 15వేల మందికి పార్టీ అనుబంధ సంఘాల్లో పదవులు ఇస్తుండడం విశేషం.

నియోజకవర్గంలో 15 వేల పదవులు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) కార్యవర్గాలు విచిత్రంగా ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రతి నాయకుడికి.. ప్రతి కార్యకర్తకి ఈ అనుబంధ సంఘాల్లో పదవులు దక్కుతున్నాయి. విచిత్రం ఏంటంటే అసలు తమకు పదవులు వచ్చాయన్న విషయం చాలామందికి తెలియదు. 2012లో పార్టీ ఆవిర్భవించింది. ఒకసారి అధికారంలోకి వచ్చింది. రెండుసార్లు ఓడిపోయింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమితోనే ఆ పార్టీలో మార్పు వచ్చింది. అంతకుముందు పార్టీ కార్యవర్గాలతో పాటు అనుబంధ విభాగాల్లో ఎవరికీ చోటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు పార్టీలో కార్యకర్త నుంచి అధినేత వరకు అందరికీ పదవులు పని చేశారు. అలా పదవులు ఇస్తే పార్టీలో కొనసాగడమే కాకుండా పార్టీ కోసం పని చేస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన.

ఉగాది నుంచి బస్సు యాత్ర…
అయితే జనంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ ఉగాది నాటి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బస్సు యాత్ర చేపట్టడం ద్వారా ప్రతి కార్యకర్తను కలవవచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అయితే ఇప్పటికే పార్టీ కార్యవర్గాలను ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ సంస్థాగత నిర్మాణాలు పూర్తయ్యాయి. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఉగాదికి మరో మూడు వారాలకు పైగా గడువు ఉంది. ఇంతలో వీటి నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. పార్టీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి పార్టీ పదవులు ఇచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి పర్యటన మరింత సక్సెస్ అయ్యేలా వారు చూస్తారన్నది ఆలోచన. మరి ఈ ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper