Homeఆంధ్రప్రదేశ్‌Jagan: రంగంలోకి జగన్.. ఇక యుద్ధమేనా?!

Jagan: రంగంలోకి జగన్.. ఇక యుద్ధమేనా?!

Jagan: రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీమంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu ) ఏకంగా సీఎం చంద్రబాబును దూషించడం, దానికి టిడిపి శ్రేణులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఏకంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి కూడా జరిగింది. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల క్రమంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పాపప్రక్షాళన పేరిట నిరసన ర్యాలీలు నిర్వహించింది. ఈ […]

Jagan: రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీమంత్రి అంబటి రాంబాబు( ambati Rambabu ) ఏకంగా సీఎం చంద్రబాబును దూషించడం, దానికి టిడిపి శ్రేణులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఏకంగా అంబటి రాంబాబు ఇంటిపై దాడి కూడా జరిగింది. తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల క్రమంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిసాయి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పాపప్రక్షాళన పేరిట నిరసన ర్యాలీలు నిర్వహించింది. ఈ క్రమంలో గుంటూరులో అంబటి రాంబాబును టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేశారు. దీంతో టిడిపి శ్రేణులు అంబటి ఇంటి పై అటాక్ చేశాయి. అయితే పోలీసులు రక్షణ కల్పించి అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచడంతో 14 రోజులపాటు ఆయనకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అంబటి రాంబాబు.

* రేపు గుంటూరుకు జగన్..
అయితే తాజా పరిణామాలపై వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు వైఖరి పై విమర్శలు చేశారు. సంచలన ట్వీట్ చేసి రాష్ట్ర హోంమంత్రికి ట్యాగ్ చేశారు. ఇంకోవైపు పార్టీ ముఖ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. రేపు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నిర్ణయించారు. గుంటూరు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు మాజీమంత్రి జోగి రమేష్ ఇంటిపై కూడా పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఆయన మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా టిడిపి శ్రేణులు రియాక్ట్ కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి శుక్రవారం వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

* పొలిటికల్ గా యాక్టివ్ కావాలని..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులను సాకుగా తీసుకొని పొలిటికల్ గా యాక్టివ్ కావాలని చూస్తోంది. ఇప్పటికే చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజకీయం చేసేందుకే ఇటువంటి రెచ్చగొట్టే ధోరణికి వైసిపి నేతలు దిగుతున్నారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగులు కూడా అలానే ఉన్నాయి. అయితే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ విషయంలో ప్రజల నుంచి అయితే మాత్రం సానుభూతి లభించడం లేదు. ఎందుకంటే వారి దూకుడు, వారి ఆలోచనలు, వారి ప్రకటనలు అభ్యంతరకరంగానే ఉంటాయి. ఏకంగా మీడియాతో పాటు పోలీసుల సమక్షంలోనే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతకుమించి అన్నట్టు జోగి రమేష్ నారా లోకేష్ పై అభ్యంతరకర కామెంట్స్ చేశారు. అయితే తాజా ఘటనలను రాజకీయంగా మలుచుకోవాలని చూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరి అంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper