Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Teaser Review: 'ధురంధర్ 2' టీజర్ రివ్యూ : ఈసారి టార్గెట్ రూ....

Dhurandhar 2 Teaser Review: ‘ధురంధర్ 2’ టీజర్ రివ్యూ : ఈసారి టార్గెట్ రూ. 3000 కోట్లు.. పాకిస్థాన్‌లో రణవీర్ సింగ్ విధ్వంసం!

Dhurandhar 2 Teaser Review: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఓటీటీ లో ఈ చిత్రం విడుదలైంది. అయినప్పటికీ కూడా థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది. అంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. […]

Dhurandhar 2 Teaser Review: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే ఓటీటీ లో ఈ చిత్రం విడుదలైంది. అయినప్పటికీ కూడా థియేటర్స్ లో విజయవంతంగా ఆడుతూనే ఉంది. అంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ చిత్రానికి ‘ధురంధర్ 2 – ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) అనే టైటిల్ ని ఖరారు చేశారు. మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ని చూసిన వెంటనే ఈసారి 3000 కోట్లు కొల్లగొట్టేలా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ల్యారీ షేర్ రెహమాన్ డెకాయిట్ ని చంపిన తర్వాత హంజా చేతుల్లోకి ఆ ల్యారీ నగరం వెళ్లడం. చిన్నగా కరాచీ మీద కూడా పట్టు సాదించి పాకిస్థాన్ మొత్తాన్ని ఏలే రేంజ్ కి హంజా ఎదగడం. ఆ స్థాయికి వెళ్లిన తర్వాత పాకిస్థాన్ నరనరాల్లో కూరుకుపోయిన టెర్రరిజాన్ని అంతం చేయడం వంటివి మనం ‘ధురంధర్ 2 – ది రివెంజ్’ లో చూడొచ్చు. అంతే కాదు ‘ధురంధర్’ చిత్రం లో రణవీర్ సింగ్ ఉరి శిక్ష కి దగ్గరగా ఉన్నా ఒక ఖైదీ లాగా చూపిస్తారు క్లైమాక్స్ లో. ‘ధురంధర్’ ఆపరేషన్ గురించి వివరిస్తూ, ఉరి శిక్ష కి దగ్గరగా ఉంటూ, జీవితం లో ఎలాంటి ఆశయం లేకుండా బ్రతికే వారికి, బ్రతికే ఒక చివరి అవకాశం ఇస్తూ, వాళ్ళ జీవితానికి ఒక లక్ష్యం కల్పిస్తూ, పాకిస్థాన్ లో స్పై గా వ్యవహరించి, అక్కడి టెర్రరిస్టుల కదలికలను అందించడమే ‘ఆపరేషన్ ధురంధర్’ అని చూపిస్తారు.

అయితే హీరో పాత్ర ఎందుకు ఉరి శిక్ష వరకు వెళ్లాల్సి వచ్చింది, గతం లో ఆయన ఎలాంటి నేరాలు చేసాడు అనేది ‘ధురంధర్ 2’ లో చూపించబోతున్నాడు. అందుకు సంబంధించిన షాట్స్ ని కూడా మనం ఈరోజు విడుదల చేసిన టీజర్ లో చూడొచ్చు. ప్రతీ భారతీయుడు గర్వ పడే రేంజ్ లో, ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ఉన్న ఒకే ఒక్క మైనస్, రెహమాన్ డెకాయిట్ పాత్ర లేకపోవడమే. ‘ధురంధర్’ చిత్రం అంత పెద్ద సెన్సేషన్ సృష్టించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రెహమాన్ డెకాయిట్ పాత్ర. అక్షయ్ ఖన్నా అద్భుతమైన నటన కనబరుస్తూ, విలన్ గా వణుకు పుట్టించాడు. ఇప్పుడు ఆయన లేని లోటు ‘ధురంధర్ 2’ లో కచ్చితంగా కనిపిస్తోంది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper