spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Sake Sailajanath : వైసీపీలోకి పిసిసి మాజీ ప్రెసిడెంట్?

Sake Sailajanath : వైసీపీలోకి పిసిసి మాజీ ప్రెసిడెంట్?

Sake Sailajanath : సాకే శైలజానాథ్ వైసీపీలో చేరుతారా? కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి అపార నష్టం కలిగింది. ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. అయినప్పటికీ చాలామంది సీనియర్లు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రఘువీరా రెడ్డి, సాకే శైలజానాథ్ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఎంతో ఆశించారు. కానీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అందుకే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. రఘువీరా రెడ్డికి జాతీయ స్థాయిలో పార్టీ కార్యవర్గంలో స్థానం లభించడంతో ఆయన అక్కడే కొనసాగనున్నారు. శైలజా నాథ్ మాత్రం తప్పకుండా పార్టీ మారుతారని టాక్ నడుస్తోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లో మారిన సమీకరణల నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

* ఎన్నికల్లో మారిన అభ్యర్థులు
ఈ ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి శ్రావణి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆమెపై బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు భావించారు. అప్పట్లో శైలజానాథ్ పేరు ప్రధానంగా వినిపించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజా నాథ్ ను రప్పించి టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడిచింది. కానీ అనూహ్యంగా శ్రావణిని రంగంలోకి దించారు చంద్రబాబు. అదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి టికెట్ ఇవ్వలేదు. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు జగన్ టికెట్ ఇచ్చారు. కానీ కూటమి ప్రభంజనంలో ఆయన సైతం ఓడిపోయారు. ఇప్పుడు సింగనమల నియోజకవర్గం వైసీపీకి నాయకుడు అవసరం. అందుకే సాకే శైలజానాథ్ వైపు జగన్ చూస్తున్నట్లు సమాచారం.

* రెండుసార్లు ఎమ్మెల్యేగా
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు సాకే శైలజానాథ్. 2004 ఎన్నికల్లో తొలిసారిగా సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సైతం రెండోసారి విజయం సాధించారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. అప్పటినుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు శైలజనాథ్. 2022లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు సింగనమల వైసీపీకి నాయకుడు కావడంతో జగన్ శైలజా నాథ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో శైలజా నాథ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper