Homeఆంధ్రప్రదేశ్‌Amravati Central Secretariat Project: ఢిల్లీ వెలుపల భారీ పవర్ సెంటర్ గా 'అమరావతి'

Amravati Central Secretariat Project: ఢిల్లీ వెలుపల భారీ పవర్ సెంటర్ గా ‘అమరావతి’

Amravati Central Secretariat Project: అమరావతికి ( Amravati capital ) వరుస శుభవార్తలే. ఎప్పటికీ అమరావతికి చట్టబద్ధతతో కేంద్రం రక్షణ కవచంగా నిలిచింది. అమరావతి గడ్డపై తన ముద్రను బలంగా చాటుతోంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ బయట కేంద్ర ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ కోసం భారీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇది నిజంగా అమరావతికి గుడ్ న్యూస్. ఎందుకంటే అమరావతికి చట్టబద్ధత కల్పించడమే కాదు.. తోడుగా నిలవాలని కేంద్రం నిర్ణయించుకోవడం మాత్రం శుభపరిణామం. సుమారు రూ.2,534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా.. అమరావతిలో కేంద్ర సంస్థలన్నీ ఒకే చోటకు రానున్నాయి. అంటే ఇక కేంద్ర కార్యకలాపాలు కూడా అమరావతి నుంచి ప్రారంభం కానున్నాయి అన్నమాట. చట్టబద్ధతతో పూర్తి రక్షణ కల్పించిన కేంద్రం.. ఇప్పుడు నేరుగా రాజధానిలో కేంద్ర సమూహాలన్నీ ఒకే చోట చేర్చడం మాత్రం గొప్ప విషయం.

* రెండు విభాగాలుగా నిర్మాణం…
కేంద్ర ప్రభుత్వం( central government) అమరావతిలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టును రెండు విభాగాలుగా విభజించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల కార్యాలయాల కోసం రూ.1299 కోట్లు కేటాయించగా.. అక్కడ పనిచేసే ఉద్యోగుల నివాస వసతుల కోసం మరో రూ.1234.91 కోట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతా అభివృద్ధి ప్రాధికార సంస్థ ( crda) 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో పాలనా సౌధం కోసం ఏకంగా 5.53 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 17 ఎకరాల్లో అత్యాధునిక బహుళ అంతస్తుల నివాస సముదాయాలు నిర్మించనున్నారు.

* అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్..
మరోవైపు ఈ ప్రాజెక్టులో భాగంగా Hudco ఆధ్వర్యంలో 10 ఎకరాల్లో ఒక అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మించనున్నారు. ప్రపంచ స్థాయి సదస్సులు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీటింగ్ నిర్వహించుకునేలా దీనిని రూపొందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే ప్రాంగణంలోకి రానుండడం అమరావతికి కొత్త శోభ రానుంది. దేశ రాజధాని ఢిల్లీ బయట ఒక మోడ్రన్ పవర్ సెంటర్ గా అమరావతిని నిలబెట్టాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper