Homeఆంధ్రప్రదేశ్‌Central Railway Budget: కేంద్ర రైల్వే బడ్జెట్లో ఏపీకి అదిరిపోయే కేటాయింపులు!

Central Railway Budget: కేంద్ర రైల్వే బడ్జెట్లో ఏపీకి అదిరిపోయే కేటాయింపులు!

Central Railway Budget: ఎన్డీఏ( National democratic Alliance ) ప్రభుత్వంలో ఏపీకి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో ఏపీలో రైలు ప్రాజెక్టుల కోసం ఏకంగా పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఏపీతోపాటు ఒడిస్సామీదుగా వెళ్లే చెన్నై,కోల్కత్తా రైల్వే క్యారిడార్ను నాలుగు వరుసలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త. ఇవి పూర్తయితే ఏపీకి రవాణా తో […]

Central Railway Budget: ఎన్డీఏ( National democratic Alliance ) ప్రభుత్వంలో ఏపీకి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. తాజాగా కేంద్ర బడ్జెట్లో ఏపీలో రైలు ప్రాజెక్టుల కోసం ఏకంగా పదివేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఏపీతోపాటు ఒడిస్సామీదుగా వెళ్లే చెన్నై,కోల్కత్తా రైల్వే క్యారిడార్ను నాలుగు వరుసలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త. ఇవి పూర్తయితే ఏపీకి రవాణా తో పాటు చాలా రకాల ప్రయోజనాలు దక్కనున్నాయి.

* బుల్లెట్ రైళ్లు..
కేంద్ర బడ్జెట్లో( Central budget) రైల్వేకు ఈసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. జాతీయస్థాయిలో.. రూ.2,77,830 కోట్లు కేటాయింపులు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 10. 25 శాతం అధికంగా కేటాయించారు. వీటికి అదనంగా బడ్జెటేతర నిధులు మరో 15 వేల కోట్లు సమకూర్చున్నారు. ఈ క్రమంలో ఏపీకి రూ.10,134 కోట్లు కేటాయించారు. అలాగే కేంద్రం ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ ట్రైన్ క్యారిడార్లలో.. మూడు బుల్లెట్ ట్రైన్లు ఏపీ మీదుగా పరుగులు పెట్టనున్నాయి. హైదరాబాద్ చెన్నై బుల్లెట్ రైలు కారిడార్ అమరావతి మీదుగా.. హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ రైల్ కర్నూలు, అనంతపురం మీదుగా.. చెన్నై- బెంగళూరు బుల్లెట్ రైలు చిత్తూరు మీదుగా పరుగులు పెట్టనుంది. ఈ మూడు కారిడార్లను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కలిపి 1671 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అత్యధికంగా 857 కిలోమీటర్ల మేరకు ఉండనుంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు డైనమిక్ జోన్ గా మారుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవి చెబుతున్నారు.

* మంత్రి కీలక ప్రకటన..
కేంద్ర బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులపై మంత్రి అశ్విని వైష్ణవ్( Minister Ashwini Vaishnav ) కీలక ప్రకటన చేశారు. ఏపీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రూ.92,649 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని వివరించారు. చెన్నై, హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక పనులు త్వరలో మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం హైదరాబాద్, చెన్నై మధ్య ప్రయాణ సమయం రెండు గంటల 55 నిమిషాలు తగ్గనుంది. ఇంకోవైపు ఏపీలో రైల్వే లైన్ల విద్యుద్దీకరణ పనులు 100% పూర్తయినట్లు కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత స్టేషన్లో పథకం కింద పునరాభివృద్ధి చేసినట్లు తెలిపారు. అత్యాధునిక వస్తువులతో ఈ రైల్వేస్టేషన్లో అందుబాటులోకి వస్తాయని కూడా చెప్పారు. మొత్తానికి అయితే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి రైల్వే పరంగా ప్రాధాన్యత దక్కినట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper