Jagan Mohan Reddy Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) అంటేనే ఒక బ్రాండ్. ఏదైనా చెప్పాలనుకుంటే నిర్మొహమాటంగా చెప్పగల ధైర్యం ఆయనది. అందుకే బాలయ్య అభిమానులు ప్రత్యేకంగా ఉంటారు. ఆయన కోసం పనిచేస్తారు. అటువంటి బాలయ్యను కెలికేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. బాలయ్య పై నిన్ననే హాట్ కామెంట్స్ చేశారు. దీంతో బాలయ్య అభిమానులు రంగంలోకి దిగారు. జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతున్నారు. తన వారాంతపు కామెంట్స్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనవసరంగా బాలయ్యను కెలకడం అవసరమా? అనే మాటలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్
* కూటమి నేతలపై విరుచుకుపడుతూ.. తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తో పట్టుబడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆరోపణలు చేసేందుకు గాను జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆ పార్టీల ప్రజాప్రతినిధులపై లైంగిక ఆరోపణల గురించి కూడా ప్రస్తావించారు. దానిని ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా మార్చుకునే పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం నిన్ననే జగన్మోహన్ రెడ్డి మాటల్లో వ్యక్తం అయింది. మొత్తం ఈ మధ్యన జరిగిన వ్యవహారాలను ప్రస్తావిస్తూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు జగన్. చివరిగా నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడారు. చాలా చులకన వ్యాఖ్యలు చేశారు. వాటిపైనే ఇప్పుడు బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.
* బాలయ్య వ్యాఖ్యలను గుర్తు చేస్తూ..
గతంలో నందమూరి బాలకృష్ణ ఓ సందర్భంలో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళలను చూస్తే ముద్దయినా పెట్టాలి.. లేకుంటే కడుపైనా చేయాలి అంటూ ఆ మధ్యన బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద విమర్శలు వచ్చాయి. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కానీ బాలకృష్ణ ఐ డోంట్ కేర్ అంటూ పట్టించుకోలేదు. ఇప్పుడు అవే వ్యాఖ్యానాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. బాలకృష్ణ అలా అనేటప్పుడు చాచిపెట్టి కొట్టాల్సింది పోయి.. హహ అంటూ నవ్వుతున్నారని సెటైర్లు వేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు అనవసరంగా బాలకృష్ణను కెలికారని.. ఆయన అభిమానులు రంగంలోకి దిగిపోయారు.
