Homeఆంధ్రప్రదేశ్‌Arava Sridhar: చివరికి బాత్రూంల నుంచి అరవ శ్రీధర్.. కొత్త వీడియో!

Arava Sridhar: చివరికి బాత్రూంల నుంచి అరవ శ్రీధర్.. కొత్త వీడియో!

Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్( arava Sridhar ) వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను లైంగికంగా వేధించారంటూ ప్రభుత్వ ఉద్యోగి హర్ష వీణ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తనకు న్యాయం చేసే వరకు శ్రీధర్ ను విడిచి పెట్టేది లేదు అంటూ ఆమె హెచ్చరిస్తూ వచ్చారు. అంతవరకు వీడియోలు విడుదల చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. రాజా గానే మరో వీడియో రిలీజ్ చేశారు. అసెంబ్లీ నుంచి నేరుగా వీడియో కాల్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు అసెంబ్లీ బాత్రూమ్ ల నుంచి కూడా వీడియో కాల్ చేయడంతో పాటు చాటింగ్ చేసినట్లు తెలుస్తోంది. అసభ్యకరపు మాటలు కూడా మాట్లాడారని.. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం అది విపరీతంగా వైరల్ అవుతోంది.

* కొనసాగుతున్న విచారణ..
మరోవైపు అరవ శ్రీధర్ పై జనసేన నాయకత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ ఆ కమిటీ ఎదుట హాజరయ్యారు అరవ శ్రీధర్. తనపై వస్తున్న వీడియోల విషయంలో వివరణ ఇచ్చారు. కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు వెళ్లడంతో.. ఆరవ శ్రీధర్ పై కేసు నమోదు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు అనుగుణంగా అరవ శ్రీధర్ పై కేసు కూడా నమోదు అయింది. అయితే అరవ శ్రీధర్ను ఆమె బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే అరవ శ్రీధర్ కు అంత సీన్ లేదని.. అంత మొత్తంలో తాను డిమాండ్ చేయలేదని.. తన జీవితం నాశనమై నందున తనకు న్యాయం చేయాలని మాత్రమే ఆమె కోరుతోంది. అవసరం అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వ్యక్తిగతంగా కలిసి కూడా నివేదిస్తానని చెప్పారు.

* సెల్ఫీ వీడియో సైతం
ఇటీవల ఒక సెల్ఫీ వీడియో( selfie video) సైతం విడుదల చేశారు బాధితురాలు హర్ష వీణ. తాను అజ్ఞాతంలోకి వెళ్లానని.. ఈ వ్యవహారంపై భయాందోళనకు గురవుతున్నానని.. ఉద్యోగరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నానని జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. అదంతా అబద్ధం అని తేల్చేశారు. ఆ ప్రచారంలో నిజం ఎంత మాత్రం లేదన్నారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆచారం నేపథ్యంలో ఈరోజు ఆమె సంచలన వీడియో బయటపెట్టారు. ఏకంగా అసెంబ్లీ బాత్రూంలో నుంచి అరవ శ్రీధర్ అసభ్యంగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Tollywood Heroes Injuries

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper