Homeఆంధ్రప్రదేశ్‌TVK MLA Comments: ఏపీలో ప్రతిపక్ష హోదా రాలేదు కానీ.. టివికె ఎమ్మెల్యే హాట్ కామెంట్స్!

TVK MLA Comments: ఏపీలో ప్రతిపక్ష హోదా రాలేదు కానీ.. టివికె ఎమ్మెల్యే హాట్ కామెంట్స్!

TVK MLA Comments: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ క్రెడిట్ చోరీ పై పక్క రాష్ట్రంలో కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. తమిళనాడులో విజయ్ గెలిచారు. రెండు ప్రధాన పార్టీల కంటే ముందంజలో నిలిచారు. అయితే దానిపై ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో విజయ్ ప్రచారం చేసుకోవడం వల్లే అక్కడ విజయం సాధ్యమైందని చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అయితే […]

TVK MLA Comments: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ క్రెడిట్ చోరీ పై పక్క రాష్ట్రంలో కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. తమిళనాడులో విజయ్ గెలిచారు. రెండు ప్రధాన పార్టీల కంటే ముందంజలో నిలిచారు. అయితే దానిపై ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో విజయ్ ప్రచారం చేసుకోవడం వల్లే అక్కడ విజయం సాధ్యమైందని చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం అయితే తెగ ప్రచారం చేసుకుంటుంది. అయితే దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు దీనిని తప్పుపడుతున్నారు. తమిళనాడులో స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అని ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు విజయ్ గెలుపుతో జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ పెంచుకోవడం పైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒకవైపు డిఎంకెకు మద్దతుగా రోజాకు ప్రచారానికి పంపించి.. ఇప్పుడు విజయ్ గెలుపులో జగన్ ఉన్నారని చెప్పడం దేనికి సంకేతం. ఇప్పుడు అదే ఇబ్బందికరంగా మారింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి..

* గట్టిగానే నిలదీసిన ఎమ్మెల్యే..
తాజాగా దీనిపై టీవీ కే ఎమ్మెల్యే ఒకరు ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. విజయ్ కెపాసిటీని గుర్తు చేస్తూ.. చెన్నై లోని టీ నగర్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవడం వల్ల టీవీకే గెలవలేదని.. అంత దమ్ముంటే ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేదు ఎందుకని ప్రశ్నించారు. నిలదీసినంత పని చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా తమిళనాడు విజయం విషయంలో అతిగా వ్యవహరిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించారు. ఇక సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. విపరీతమైన ఎలివేషన్లతో విజయ్ విజయంలో జగన్ ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు.

* ఆ ముగ్గురు స్నేహితులని తెలుసు
అయితే తమిళనాడులో టీవీకె పార్టీ నేతలకు ఒక స్పష్టత ఉంది. స్టాలిన్ తో ఎవరెవరు అనుబంధంగా ఉన్నారో వారికి తెలుసు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,, జగన్మోహన్ రెడ్డితో స్టాలిన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. తమిళనాడులో స్టాలిన్ గెలవాలని ఆ ఇద్దరు నేతలు బలంగా కోరుకున్నారు. ఇప్పుడు విజయ్ విజయం సాధించే సరికి.. ఇలా కొత్త వాదనలు తీసుకొస్తున్నారు. అందుకే టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే నేరుగా ఇప్పుడు హాట్ కామెంట్స్ చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్కైంది. సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper