Homeక్రీడలుAhmedabad Plane Crash: విజయ్ రూపానీని వెంటాడిన 1206 నంబర్ కథ.. అదే ఆయన ప్రాణాలు...

Ahmedabad Plane Crash: విజయ్ రూపానీని వెంటాడిన 1206 నంబర్ కథ.. అదే ఆయన ప్రాణాలు తీసింది

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ సమీపంలో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లండన్‌కు వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడంతో 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ విషాద ఘటనకు సంబంధించి ఎన్నో వార్తలు వెలుగులోకి వస్తున్నా, ఒక ‘లక్కీ నంబర్’ చుట్టూ జరుగుతున్న చర్చ ఇప్పుడు నెటిజన్లలో ఆసక్తిని రేపుతోంది.

విజయ్ రూపానీ లక్కీ నంబర్ 1206 వెనుక కథ
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ క్రాష్ అయిన విమాన ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే, ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటపడింది. విజయ్ రూపానీకి 1206 అనేది చాలా అదృష్ట సంఖ్య అట. ఆయనకు చెందిన అన్ని వాహనాల నంబర్ ప్లేట్లపై కూడా 1206 అని ఉండేదని చెబుతున్నారు. ఈ నంబర్ విజయ్ రూపానీకి ఎంతో కలిసిరావడంతో, దీనిని తన లక్కీ నంబర్‌గా భావించేవారట.

Read Also: భూమ్మీద నూకలు రాసి ఉంటే ఇలా బతికిపోతారు.. అహ్మదాబాద్‌ ప్రమాదంలో ఆలస్యంతో బతికిందిలా..

అదృష్టం దురదృష్టంగా మారిందా?
కానీ, ఇప్పుడు అదే లక్కీ నంబర్ ఆయన ప్రాణాలను తీసిందని కొన్ని వదంతులు, నెటిజన్ల చర్చలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం, ఆయన ప్రయాణించిన విమానం నంబర్ కూడా 1206 కావడమేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనితో, మాజీ సీఎంకు అదృష్ట సంఖ్యగా భావించినదే దురదృష్టంగా మారిందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ విమాన నంబర్, ప్రయాణికుల వివరాలపై అధికారిక నిర్ధారణ ఇంకా వెలువడలేదు. ప్రజలు మాత్రం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, ఇది విధి విచిత్రమని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రధాని మోడీ పరామర్శ
ఈ ప్రమాద ఘటన అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, పరామర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also: విమాన ప్రమాదంలో పరిహారం ఎంతిస్తారు? అహ్మదాబాద్ ఘటనలో ఎంత లభిస్తుందంటే?

241 మందిలో బతికింది ఒక్కడే
ఈ ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు అనే వార్త అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఒక్క వ్యక్తిని ‘మృత్యుంజయుడు’ అని అంటున్నారు. అసలు అదృష్టవంతుడు అతడే అని, మృత్యువు అంచున నుండి తిరిగి వచ్చాడని చెబుతున్నారు. ఆ వ్యక్తి పేరు రమేష్. కానీ, ఇంతటి పెను ప్రమాదంలోనూ ప్రాణాలతో బయటపడటం నిజంగా ఒక అద్భుతం

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular