Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Housing Scheme: ఏపీలో లంచాలు లేకుండానే ఇళ్ల స్థలాలు.. చంద్రబాబు ముందు చూపు.....

Andhra Pradesh Housing Scheme: ఏపీలో లంచాలు లేకుండానే ఇళ్ల స్థలాలు.. చంద్రబాబు ముందు చూపు.. పేదల చేతికి 52 కోట్ల ఆస్తి..

Andhra Pradesh Housing Scheme: ఏపీ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతోంది. పేదలు ఎవరి మీద ఆధారపడకుండా. స్వేచ్ఛగా.. ఆత్మగౌరవంతో బతకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాల పట్టాలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమం లాగా నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పూలే విగ్రహం కూడలి వద్ద సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం అందించింది. […]

Andhra Pradesh Housing Scheme: ఏపీ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతోంది. పేదలు ఎవరి మీద ఆధారపడకుండా. స్వేచ్ఛగా.. ఆత్మగౌరవంతో బతకాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ శాశ్వత గృహాల పట్టాలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమం లాగా నిర్వహిస్తోంది.

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పూలే విగ్రహం కూడలి వద్ద సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంతంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం అందించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా మొదలుపెట్టారు. గడిచిన దశాబ్దాలుగా ప్రభుత్వ ఆక్రమిత స్థానాల్లో ఇక్కడి పేదలు ఉంటున్నారు. వారంతా కూడా రేకుల షెడ్లలో.. అసౌకర్యాల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఆ పేదలందరికీ శాశ్వత గృహ భద్రతను కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇళ్లకు పట్టాలు పంపిణీ చేయడం ద్వారా ఒక్క నెల్లూరు నగరంలోనే దాదాపు 600 కోట్ల విలువైన ఆస్తులను పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. మొత్తంగా ఎకరాల విస్తీర్ణంలో 939 మంది లబ్ధిదారులకు అధికారులు పట్టాలు అందించారు. 939 మంది లబ్ధిదారులలో 701 మంది మహిళలు ఉండడం ఇక్కడ విశేషం. కూటమి ప్రభుత్వం పేదలకు పట్టాలు పంపిణీ చేయడం ద్వారా నిజమైన మహిళా సాధికారతను నిరూపించింది. అయితే పట్టాల పంపిణీ ఇక్కడితో ఆగదని.. వచ్చే సంక్రాంతి నాటికి నెల్లూరు నగరంలో మరో 4000 మందికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు.. విజయవాడ.. మంగళగిరి ప్రాంతంలో ఇప్పటివరకు 60 వేల కుటుంబాలకు ఏకంగా 52,000 కోట్ల విలువైన ఆస్తులను గృహ పట్టాల రూపంలో ప్రభుత్వం అందజేసింది. ఒక రకంగా భారత చరిత్రలో ఇది రికార్డు.

గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలు గృహాలకు సంబంధించిన పట్టాలు పొందాలంటే అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వచ్చేది. లంచాలు ఇస్తేనే పత్రాలు ఇచ్చేవారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లంచం లేకుండానే.. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. దీనికి తోడు మహిళలకు పట్టుచీర.. పసుపు, కుంకుమ అందజేస్తున్నారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో సర్వేపల్లి కాల్వకట్ట ప్రాంత వాసుల 60 ఏళ్ల కష్టాలకు పరిష్కారం లభించింది. త్వరలోనే జాఫర్ సాహెబ్ కాలు ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.

కేవలం గృహాలకు సంబంధించిన పట్టాలు మాత్రమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రాజా ముద్రత కూడిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తోంది. తద్వారా ప్రభుత్వ పరిపాలన అత్యంత పారదర్శకంగా సాగుతోంది. పేదలకు కేవలం గృహాలకు సంబంధించిన స్థలాలు మాత్రమే కాకుండా.. ప్రతి ఇంటికి సంబంధించి నల్లా కనెక్షన్.. సంజీవని వైద్య సేవలు.. దీపం 2 ఉచిత గ్యాస్.. స్త్రీ శక్తి ఉచిత బస్సు వంటి పథకాలను జోడించి ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటున్నది. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. పేదలకు కల్పిస్తున్న ఈ ఇంటి యోగం మహా యజ్ఞం లాగా కొనసాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper