Pawan Kalyan: సోమవారం రాత్రి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన సతీమణి అన్నా లెజ్ నోవా తో విడిపోతున్నట్టు ప్రకటించారు. పరస్పర అధికారంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ సమయంలో తమ గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని అభిమానులకు.. శ్రేయోభిలాషులకు విన్నవించారు. దీంతో నిన్న రాత్రి నుంచి తెలుగు ప్రధాన మీడియా సంస్థల్లో.. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నందిని.. రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మూడో భార్యతో కూడా విడాకులు తీసుకోవడంతో సర్వత్ర చర్చకు దారితీస్తోంది.
గతంలో పవన్ కళ్యాణ్ ను అభిమానులు వెనకేసుకొచ్చారు. ఆయనకు సపోర్ట్ గా నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మొదటి భార్యతో విడాకులు ఆయన వ్యక్తిగత వ్యవహారం. సరే అది పొరపాటున జరిగి ఉండవచ్చు అనుకున్నారు. రెండవ భార్య రేణు దేశాయ్ తో విడాకులు.. సరే అది కూడా కాస్త వ్యక్తిగత విభేదాలు వల్ల జరిగి ఉండవచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు మూడవ వివాహ విషయంలో కూడా ఇలా జరగడం వెనక కారణాలు ఏవై ఉన్నప్పటికీ.. అన్ని చేతివేళ్లు పవన్ కళ్యాణ్ ను చూపిస్తున్నాయి.. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సపోర్ట్ గా నిలిచే అవకాశాలు కల్పించడం లేదు. వాస్తవానికి పెళ్లిళ్లు చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అయినప్పటికీ.. ఆయన ఒక ప్రజా ప్రతినిధి. ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇలాంటప్పుడు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజల్లో చర్చకు కారణమవుతుంది.
పవన్ కళ్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకునే విషయం రేణు దేశాయ్ కి ముందే తెలుసా.. అందువల్లే ఆమె వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. సరిగా కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ విడాకుల మీద పరోక్షంగా రేణు దేశాయ్ స్పందించారు..” విడాకులు తీసుకొని 14 ఏళ్ళు అవుతోంది. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు.. రేణు దేశాయ్ నాడు చేసిన వ్యాఖ్యలను కొంతమంది విశ్లేషకులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. విడాకులు చోటు చేసుకుంటారని ముందుగానే రేణు దేశాయ్ చెప్పేశారని కొంతమంది అభిమానులు గుర్తు చేస్తున్నారు. గతంలో రేణు దేశాయ్ తో పవన్ విడాకులు తీసుకున్నప్పుడు అభిమానులు కూడా ఆ నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా రేణు దేశాయ్ బయట కనపడితే చాలామంది వదిన అంటూ పిలుస్తారు. దానికి ఆమె ఒప్పుకోదు. తనను అక్క అని పిలవాలని సూచిస్తారు. ఇటీవల డాన్స్ మాస్టర్ జానీ రేణు దేశాయ్ ని వదిన అని పిలిస్తే.. ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అక్క అని పిలవాలని సూచించారు.
పవన్ ఇటీవల కాలంలో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యం కూడా అంత గొప్పగా లేదు .. పైగా స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినప్పటికీ ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదు. గతంలో ఆయనకు సర్జరీ జరిగినప్పుడు భార్య అన్నా ముంబై వెళ్లారు. కేరళలో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మాత్రం ఆయన వెంట లేరు. పైగా కుమారుడు మార్క్ శంకర్ విద్యాభ్యాసం కోసం అన్నా సింగపూర్ లోనే ఉంటున్నారు. ఆ మధ్య మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు.. అతడిని ఇండియాకు తీసుకొచ్చారు. ఇక్కడే చదివిస్తున్నారు. అప్పటినుంచి అన్నా ఇక్కడే ఉంటున్నారు. కేరళలో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అన్నా కనిపించకపోవడం.. ఇటీవల సాయి ధరంతేజ్ ఎంగేజ్మెంట్ లో కూడా కనిపించకపోవడంతో అందరి అనుమానాలను నిజమయ్యాయి. మొత్తానికి వాటికి అవును అని సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రెస్ నోట్.. అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచింది