Homeఆంధ్రప్రదేశ్‌special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటికే జూలై 14 గడువు విధించగా మరో 10 రోజులు అంటే జూలై 24 వరకు గడువులు పెంచారు. దీంతో ఈ గడువు రేపటితో ముగియనుంది. అయితే గడువు ముగిస్తుండడంతో ఓటర్లు అప్రమత్తం కావాలని అధికారులు పూజిస్తున్నారు. ఇప్పటివరకు […]

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటికే జూలై 14 గడువు విధించగా మరో 10 రోజులు అంటే జూలై 24 వరకు గడువులు పెంచారు. దీంతో ఈ గడువు రేపటితో ముగియనుంది. అయితే గడువు ముగిస్తుండడంతో ఓటర్లు అప్రమత్తం కావాలని అధికారులు పూజిస్తున్నారు. ఇప్పటివరకు సార్ ఫారం తీసుకొని వారు.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అంటున్నారు. అలాగే ఇప్పటికే ఫామ్ పొందిన వారు వాటిని పూర్తి చేసి బిఎల్ఓ లకు అందించాలని చెబుతున్నారు. అసలు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని దరఖాస్తులు నమోదయాయి అంటే?

ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫారంలు ముద్రించారు. వీటిలో 3.86 కోట్ల ఫారాలను పంపిణీ చేశారు. వీటిలో దాదాపు 62 లక్షల వరకు డిజిటలైజేషన్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారిక లెక్కలు ప్రచురించలేదు. కొంతమంది అవగాహన లేక ఈ ఫారాలను పొందినా కూడా వాటిని బిఎల్ఓ లకు అందించలేదు. అంతేకాకుండా వివరాలు సేకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా 2002 నాటి వివరాలను నమోదు చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు అవగాహన లేక తమ కుటుంబ సభ్యుల ను సంప్రదించలేక ఆ కాలంను విడిచి పెడుతున్నారు. మరికొందరు తప్పుడుగా నమోదు చేస్తున్నట్టు కొందరు పేర్కొంటున్నారు. అయితే కొంతమంది అధికారులు తెలుపుతున్న ప్రకారం సంబంధిత బిఎల్ఓ లను సంప్రదించి సరైన వివరాలు నమోదు చేయాలని అంటున్నారు. అంతేకాకుండా గడువులోగా ఫారాలను ఇస్తేనే ఓటు హక్కు ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈసారి గడువు పెంచే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది.

తెలంగాణలోనూ సర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో కూడా గతంలో జూలై 24 వరకు గడువు విధించగా ఆ తర్వాత ఆగస్టు 3 వరకు గడువును పెంచారు. అయితే కొందరు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉండడంతో వారి వివరాలు సేకరించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఆన్లైన్లో ఓటు హక్కును నమోదు చేసుకుంటున్నారు. మాన్యువల్ గా చాలా సమస్యలు ఎదుర్కోవడంతో కొందరు అధికారులు ఆన్లైన్ లో తమ వివరాలను నమోదు చేయడానికి అవకాశం ఇచ్చారు. ఎన్యుమరేషన్ ఫామ్ పొందని వారు తాసిల్దార్ కార్యాలయం లేదా మీసేవ కార్యాలయాల్లో పొందవచ్చని పేర్కొంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper