
తామే 23 కంపెనీల ద్వారా భూములు అభివృద్ధి చేసి రూ.2 వేల కోట్లు సేకరిస్తామని అగ్రిగోల్డ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు అభ్యంతరం చెప్పింది. 23 చోట్ల చేసే అభివృద్ధి పనులను తాము పర్యవేక్షణ చేయలేమని చెప్పింది. ఒకవేళ ఒప్పుకున్నా ఆ పనుల్లో వివాదాలు వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం మరింత ఆలస్యం అవుతుందని అభిప్రాయపడింది. చిన్న మొత్తాల పొదుపు పేరుతో జనాన్ని మోసం చేసిన అగ్రిగోల్డ్ పై దాఖలైన పిల్స్ ను న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టి. అమర్ నాథ్ గౌడ్ ల ధర్మాసనం శుక్రవారం విచారించింది.