Homeఆంధ్రప్రదేశ్‌AP cracker unit blast 18 lives: ఏపీలో అంతులేని విషాదం.. 18 మంది మృత్యువాత

AP cracker unit blast 18 lives: ఏపీలో అంతులేని విషాదం.. 18 మంది మృత్యువాత

AP cracker unit blast 18 lives: ఏపీని వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. ఓవైపు కల్తీ పాలు.. ఇంకోవైపు డయేరియా.. ఇప్పుడు బాణసంచా ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాత. ఇలా వరుస ఘటనలతో ఏపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మొన్న మధ్యన రాజమండ్రి పరిసరాల్లో కల్తీ పాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కాకినాడ జిల్లా సామర్లకోటలో బాణసంచా తయారీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. […]

AP cracker unit blast 18 lives: ఏపీని వరుసగా వివాదాలు వెంటాడుతున్నాయి. ఓవైపు కల్తీ పాలు.. ఇంకోవైపు డయేరియా.. ఇప్పుడు బాణసంచా ప్రమాదంలో పదుల సంఖ్యలో మృత్యువాత. ఇలా వరుస ఘటనలతో ఏపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మొన్న మధ్యన రాజమండ్రి పరిసరాల్లో కల్తీ పాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కాకినాడ జిల్లా సామర్లకోటలో బాణసంచా తయారీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఇలా వరుస ఘటనలతో ఏపీ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

ఆకస్మికంగా పేలుడు..
సామర్లకోట మండలంలోని వేట్లపాలెం లో.. గోదావరి కాలువ సమీపంలో సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ యూనిట్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆకస్మికంగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద సమయంలో అక్కడ 35 మంది వరకు పనిచేస్తున్నట్లు సమాచారం. పేలుడు తీవ్రత దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీ శబ్దానికి సమీప గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాల భవనం స్లాబ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు భారీగా అక్కడకు చేరుకున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

Also Read: ఆ మంత్రికి టిడిపి రాష్ట్ర పగ్గాలు?!

సీఎం చంద్రబాబు ఆదేశాలు..
పేలుడు సంభవించిన సమయంలో భారీ శబ్దాలు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఘటనా స్థలం హృదయ విదారకంగా కనిపిస్తోంది. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కూడా కష్టతరంగా మారింది. పరిమితికి మించి బాణసంచా తయారీ జరగడం ఈ ప్రమాదానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటనలో ఉన్నారు. అక్కడినుంచే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులతో పాటు ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించారు. ఘటన దురదృష్టకరంగా పేర్కొన్నారు. తక్షణం బాధితులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper