Nellore politics update: నెల్లూరు జిల్లా( Nellore district) రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీలో ఐక్యత దెబ్బతింటోంది. మరోవైపు పూర్వవైభవానికి వైయస్సార్ కాంగ్రెస్ తహతహలాడుతోంది. ఈ తరుణంలో అధికార పార్టీకి గట్టి సవాల్ విసురుతోంది. మొన్నటి ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అయితే భారీ అంచనాలతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. అయితే ఎలాగైనా నెల్లూరులో మరోసారి పాగా వేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గట్టి ప్రయత్నమే చేస్తోంది. అయితే అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రూపొందిస్తోంది. కానీ నేతల మధ్య విభేదాల పర్వం నడుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య అంతగా సఖ్యత లేనట్లు కనబడుతోంది.
Also Read: నాన్న.. మళ్లీ రావా.. జగన్ ఏమోషనల్ వీడియో
రెండు మంత్రి పదవుల కేటాయింపు..
జిల్లాలో మంత్రులుగా పొంగూరు నారాయణ( Narayana), ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. ఎందుకనో ఆనం రామనారాయణరెడ్డి మాత్రం మంత్రి పదవిలో అంతగా సంతృప్తి చెందడం లేదు. బహుశా దేవాదాయశాఖ ఇవ్వడం వల్లే ఆయన అసంతృప్తి చెందారు అన్నది ఒక కామెంట్. అయితే అదే జిల్లాకు చెందిన నారాయణకు కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. ఆ పై అమరావతి నిర్మాణ బాధ్యతలను కేటాయించారు. ఇది ఆనం రామనారాయణరెడ్డి లో ఒక రకమైన అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. ఇటీవల మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే మంత్రి నారాయణ పై నేరుగా విమర్శలు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. కార్పొరేట్ శక్తిగా అభివర్ణించారు. ఇది లోకేష్ కు సైతం షాకింగ్ ఇచ్చింది.
Also Read: గతానికి భిన్నంగా ‘బాబు’.. అలా కలవడం కరెక్టేనా?!
సీనియర్ మోస్ట్ లీడర్
ఆనం రామనారాయణ రెడ్డి( Anam ramanarayana Reddy ) సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి పదవి చేపట్టారు. 2014లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. తరువాత కాకాని గోవర్ధన్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆనం రామనారాయణరెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే ముందస్తుగా అసంతృప్తి కామెంట్స్ తో ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు పార్టీపై విమర్శలు చేశారు. తర్వాత బయటకు వెళ్లిపోయారు. అయితే తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా అదే విధంగా అసంతృప్తి కామెంట్స్ చేస్తుండంతో అందరిలో అనుమానాలు ప్రారంభమయ్యాయి.