Nara Lokesh Thanks Revanth Reddy : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పోలవరం, బానకచర్ల నీటి పంపకాల వ్యవహారం పై వివాదాలు అలుముకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ విషయం పై నేరుగానే స్పందించి ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అందుకు మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా బలంగా తమ వాదనలు వినిపించింది. అయితే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) ఈ అంశంపై మాట్లాడుతూ గోదావరి నది జలాల పై ఇరు రాష్ట్రాలకు హక్కు ఉంది, కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకుంటాం,భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇది కాసేపు పక్కన పెడితే మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ట్విట్టర్ ద్వారా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి కృతఙ్ఞతలు తెలియజేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతిరూపం, తెలుగు జాతి వెలుగు సంతకం, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మహానాయకుడు నందమూరి తారకరామారావు స్మృతివనం అయిన ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం కోటి 35 లక్షల రూపాయిల బడ్జెట్ ని విడుదల చేయడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హుర్దయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అదే విధంగా నేడు ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తల్లికి వందనం లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన సందర్భంగా ఆయన ఏడాది కాలం లో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తూ చాలా చక్కగా మాట్లాడాడు. అప్పుడే మేము అన్నీ చేసేశామని చెప్పుకోవడం లేదు. చెయ్యాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇది తొలిఅడుగు మాత్రమే అంటూ ఆయన మాట్లాడిన మాటలు వీర అయ్యాయి.