IND vs AFG: సముద్రాన్ని ఈ దిన వాళ్లకు పిల్ల కాలువను చూపిస్తే ఎలా ఉంటుంది.. ఇనుమును సైతం వంచిన వాళ్లకు గడ్డి పరికలు ఇస్తే ఎలా ఉంటుంది.. సేమ్ టీమ్ ఇండియాకు బౌలింగ్ వేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల పరిస్థితి కూడా దాదాపు ఇదే.
మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటికే తొలి మ్యాచ్ కోల్పోయింది ఆఫ్గానిస్తాన్. రెండో మ్యాచ్లో కూడా సేమ్ సీన్ రిపీట్. ఢిల్లీలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ ఇబ్రహీం(37), రషీద్ (28), రసూల్ (26) మినహా మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో, 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
160 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ప్రారంభించి దూకుడు కొనసాగించింది.. ఓపెనర్లు సంజు శాంసన్ (57), అభిషేక్ శర్మ (39) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో తొలి వికెట్ కు 88 పరుగుల భాగస్వామ్యం లభించింది. వీరిద్దరూ కేవలం 38 బంతుల్లోనే ఈ ఘనత అందుకోవడం విశేషం. ఇద్దరు పోటీపడి పరుగులు చేశారు. ముఖ్యంగా మహమ్మద్ నబీ వేసిన ఆరవ ఓవర్ లో తొలి బంతిని అభిషేక్ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి సింగిల్ తీశాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు బంతుల్లో సంజు 6,4,4,6 పరుగులు తీశాడు. దీంతో ఒకే ఓవర్లో 27 పరుగులు వచ్చాయి.. ఈ నేపథ్యంలో అభిషేక్ 39.. సంజు 57 పరుగులు చేసి అవుట్ అయ్యారు. వీరిద్దరు గనుక మ్యాచ్ ఫలితం వారిగా వచ్చేది. అయితే ఈ దశలో కెప్టెన్ అయ్యర్ రంగంలోకి వచ్చినప్పటికీ.. అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 11 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కిషన్ 17.. తిలక్ రెండు పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి ఇంకా 32 పరుగులు అవసరం ఉంది. ఇంకా 50 బంతుల్లో భారత్ ఈ లక్ష్యాన్ని అందుకోవాలి. ఈ విజయం నల్లేరు మీద నడకనే. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన టీమ్ ఇండియా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకున్నట్టే.
తొలి మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో మూడవ మ్యాచ్ సెప్టెంబర్ 17న ఢిల్లీలో జరుగుతుంది. తొలి మ్యాచ్లో కూడా కెప్టెన్ 8* పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. అదే ఫామ్ రెండు మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేశాడు. ఫామ్ విషయంలో అభిషేక్ శర్మ కొంతకాలంగా కంటిన్యూటీ కొనసాగిస్తున్నాడు. అందువల్లే ఇలా పరుగులు చేయగలుగుతున్నాడు. తొలి మ్యాచ్లో సంజు పది పరుగులు మాత్రమే చేయగలిగాడు. వాస్తవానికి బేబీ బాస్ వైభవ్ సూర్య వంశీని పక్కనపెట్టి సంజు కు అవకాశం ఇచ్చింది మేనేజ్మెంట్. కాని దానిని అతడు సద్వినియోగం చేసుకోలేదు. తొలి మ్యాచ్లో దారుణంగా అవుట్ కావడంతో.. అతని మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి. చివరికి రెండో మ్యాచ్లో తన సత్తా చూపించాడు సంజు.. టీమ్ ఇండియా గెలుపుకు బ్రహ్మాండమైన బాటలు వేశాడు. దీంతో అతని మీద వస్తున్న విమర్శలు పటాపంచలు అయ్యే అవకాశం ఉంది.
6,4,4,6 BY SANJU SAMSON – Moment of the match ❤️
– The main man is back. pic.twitter.com/hRrVuoc1XZ
— Johns. (@CricCrazyJohns) September 15, 2026