Homeటాప్ స్టోరీస్Amit Shah: అమిత్ షా ప్రసంగం.. కాంగ్రెస్ కు దూరంగా.. బీఆర్ఎస్ కు దగ్గరగా.. ఏంటీ...

Amit Shah: అమిత్ షా ప్రసంగం.. కాంగ్రెస్ కు దూరంగా.. బీఆర్ఎస్ కు దగ్గరగా.. ఏంటీ కథ?

Amit Shah: మొత్తానికి కమలం పార్టీ అధిష్టానానికి తెలంగాణ గుర్తుకొచ్చింది. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు యాదికి తెచ్చుకుంది. ఇన్ని రోజులపాటు పార్టీని గాలికి వదిలేసిన అధిష్టానం.. మొత్తానికి ఏదో సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ సొంతంగా పాదయాత్ర చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు మిగతా ఎంపీలు ఎవరి దారి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొంతకాల క్రితం ఈటల రాజేందర్.. బండి సంజయ్ మధ్య ఎలాంటి వ్యవహారాలు సాగాయో అందరికీ […]

Amit Shah: మొత్తానికి కమలం పార్టీ అధిష్టానానికి తెలంగాణ గుర్తుకొచ్చింది. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు యాదికి తెచ్చుకుంది. ఇన్ని రోజులపాటు పార్టీని గాలికి వదిలేసిన అధిష్టానం.. మొత్తానికి ఏదో సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ సొంతంగా పాదయాత్ర చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు మిగతా ఎంపీలు ఎవరి దారి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొంతకాల క్రితం ఈటల రాజేందర్.. బండి సంజయ్ మధ్య ఎలాంటి వ్యవహారాలు సాగాయో అందరికీ తెలుసు.

అకస్మాత్తుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చారు. మహా పాదయాత్ర నిర్వహించారు. వాస్తవానికి ఆయన ప్రసంగంలో ఈసారి కాస్త వేరే కోణం కనిపించింది. ప్రారంభం నుంచి చివరి దాకా కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మండిపడ్డారు. బహుశా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ చేపడుతున్న కార్యక్రమాల వల్ల కలిగిన ఇబ్బంది కావచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలిస్తామని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే.. తదుపరి తెలంగాణ పీఠాన్ని బిజెపి అధిష్టిస్తుందా.. ఈ ప్రశ్నకు అవును అని అమిత్ షా సమాధానం చెప్పగలరా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి అమిత్ షా చేపట్టిన మహా పాదయాత్ర ఉద్దేశం ఏమిటో తెలియదు గానీ.. ఇప్పటికే బీజేపీలో లుకలుకలు బయట పడుతున్నాయి. ఇటీవల పార్టీ తెలంగాణ ఇన్చార్జి ఓపెన్ గానే పార్టీలో ఉన్న పరిస్థితిని బయటపెట్టేశారు. నేతలు ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. అసలు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం లేదని.. పార్టీ కోసం పనిచేయని వ్యక్తులకు పదవులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు అదే వేదిక మీద చాలామంది నాయకులను కడిగిపారేశారు. పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అరిష్టానానికి నివేదిక ఇచ్చారు. బహుశా అందువల్లే అమిత్ షా ఇక్కడికి వచ్చి ఉంటారని తెలుస్తోంది. వాస్తవానికి 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బిజెపికి మంచి ఊపు ఉండేది. పైగా.. బండి సంజయ్ నెత్తురుత్వంలో బిజెపి దూకుడు మీద ఉండేది. ఎప్పుడైతే బండి సంజయ్ ను పక్కనపెట్టి.. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. అధికారంలోకి వస్తుంది అనే ధీమా నుంచి.. పట్టుమని పది సీట్లు గెలుచుకోలేని దుస్థితికి బిజెపి పడిపోయింది..

ఇక పార్లమెంటు ఎన్నికల్లో కాస్త పర్వాలేదు అనుకున్నప్పటికీ.. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఏ మేరకు దూకుడు చూపిస్తుందో చూడాలి. గతంలో మాదిరిగా ఇప్పుడు ఆ పార్టీ నేతలు పని చేస్తారా.. అంతటి అవకాశం ఉందా.. ఈ ప్రశ్నలకు బిజెపి నాయకులే సమాధానం చెప్పాలి. అన్నట్టు గతంలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమిత్ షా భీకరంగా వ్యాఖ్యలు చేశారు. కానీ కెసిఆర్ కుటుంబంలో ఒకరిని కూడా జైలుకు పంపించలేకపోయారు.. ఇప్పుడు కాంగ్రెస్ విషయంలో కూడా అమిత్ షా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా.. అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.. కానీ అమిత్ షా మొత్తం ప్రసంగంలో గులాబీ పార్టీ ప్రస్తావన లేదు. అంటే ఆ పార్టీ అవినీతికి.. ఇతర దుర్మార్గాలకు అమిత్ షా క్లీన్ చీటీ ఇచ్చినట్టేనా.. అన్నట్టు కాలేశ్వరం.. ఇతర కేసుల్లో నిజాలు బయట పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు ఆ మధ్య రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేసులను కూడా అప్పగించారు. మరింత వరకు ఒక అరెస్టు కూడా జరగలేదు.. మరి దీనిపై అమిత్ షా సమాధానం చెప్పలేదు. అసలు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper