Homeబిజినెస్Smartphones Under 25000 : Lava Virat Curve 5G vs Poco M8 Power...

Smartphones Under 25000 : Lava Virat Curve 5G vs Poco M8 Power vs Vivo T5 Lite 5G.. ఏ ఫోన్ బెస్ట్?

Smartphones Under 25000 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.25 వేల లోపు ధరలో కొత్త ఫోన్ల పోటీ మరింత పెరుగుతోంది. తాజాగా Lava Virat Curve 5G ఈ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 6,000mAh బ్యాటరీ, MediaTek Dimensity 7100 చిప్‌సెట్, 120Hz AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌కు Poco M8 Power, Vivo T5 Lite 5G ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తున్నాయి. ఈ మూడు ఫోన్లలో ఏది మెరుగైనదో చూద్దాం. […]

Smartphones Under 25000 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.25 వేల లోపు ధరలో కొత్త ఫోన్ల పోటీ మరింత పెరుగుతోంది. తాజాగా Lava Virat Curve 5G ఈ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 6,000mAh బ్యాటరీ, MediaTek Dimensity 7100 చిప్‌సెట్, 120Hz AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌కు Poco M8 Power, Vivo T5 Lite 5G ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తున్నాయి. ఈ మూడు ఫోన్లలో ఏది మెరుగైనదో చూద్దాం.

ధరలు ఎలా ఉన్నాయి?
Lava Virat Curve 5G 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఇది Ellora Slate, Heritage Indigo, Makrana Ivory కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Poco M8 Power 6GB+128GB వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8GB+128GB మోడల్ ధర రూ.27,999. Black, Blaze Orange, Green రంగుల్లో అందుబాటులో ఉంది.
Vivo T5 Lite 5G మాత్రం ఈ మూడింటిలో తక్కువ ధరకు లభిస్తోంది. 4GB+128GB వేరియంట్ రూ.19,999, 6GB+128GB రూ.21,999, 6GB+256GB వేరియంట్ రూ.24,999గా ఉంది.

డిస్‌ప్లేలో ఎవరిది పైచేయి?
Lava Virat Curve 5Gలో 6.75-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Android 16తో పాటు వెనుకవైపు ప్రత్యేక డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది.
Poco M8 Powerలో 6.90-అంగుళాల Full HD+ 120Hz డిస్‌ప్లే ఉండగా, Gorilla Glass 7i రక్షణ లభిస్తుంది. HyperOS 3 ఆధారిత Android 16తో పనిచేస్తుంది.
Vivo T5 Lite 5Gలో 6.74-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే ఉంది. ఇది OriginOS 6 ఆధారిత Android 16పై పనిచేస్తుంది. రిజల్యూషన్ విషయంలో మాత్రం Lava, Poco ముందంజలో ఉన్నాయి.

బ్యాటరీ, ప్రాసెసర్
Lava Virat Curve 5Gలో MediaTek Dimensity 7100 చిప్‌సెట్, 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. 6,000mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
Poco M8 Powerలో Snapdragon 4 Gen 4 ప్రాసెసర్, గరిష్ఠంగా 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో ఏకంగా 8,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తున్నారు.
Vivo T5 Lite 5Gలో Dimensity 6300 చిప్‌సెట్, 4GB/6GB RAM, 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 6,500mAh బ్యాటరీతో పాటు 44W FlashCharge సపోర్ట్ ఉంది.

కెమెరాలు ఎలా ఉన్నాయి?
Lava Virat Curve 5Gలో 50MP వెనుక కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Poco M8 Powerలో 50MP ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. Vivo T5 Lite 5Gలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 0.08MP సెకండరీ సెన్సార్, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

మరి ఏది కొనాలి?
బ్యాటరీకి ప్రాధాన్యత ఇస్తే Poco M8 Power ఆకట్టుకుంటుంది. 8,000mAh బ్యాటరీ, పెద్ద 6.90-అంగుళాల డిస్‌ప్లే దీనికి ప్రధాన బలాలు. డిస్‌ప్లే క్వాలిటీ, ప్రాసెసింగ్ పవర్ కావాలనుకునేవారికి Lava Virat Curve 5G మంచి ఎంపిక. ఇక తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, 5G ఫోన్ కావాలనుకునేవారికి Vivo T5 Lite 5G ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలుస్తుంది.
మొత్తంగా చూస్తే.. ప్రీమియం డిస్‌ప్లే కోసం Lava, భారీ బ్యాటరీ కోసం Poco, బడ్జెట్ కోసం Vivo ఎంచుకోవచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper