Oppo K14 Lite : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు Oppo సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా K14 సిరీస్‌లో మరో బడ్జెట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Oppo K14 Lite పేరుతో రానున్న ఈ ఫోన్ తాజాగా భారత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీంతో భారత్‌లో దీని లాంచ్ త్వరలోనే ఉండొచ్చనే అంచనాలు పెరిగాయి.
CPH3007 మోడల్ నంబర్‌తో BISలో లిస్టింగ్
Oppo కొత్త స్మార్ట్‌ఫోన్ CPH3007 మోడల్ నంబర్‌తో BISలో నమోదైంది. ఇదే మోడల్ గతంలో Google Play Consoleలో కూడా కనిపించినట్లు సమాచారం. అయితే BIS లిస్టింగ్‌లో ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు. లీకుల ప్రకారం ఈ ఫోన్‌ను Oppo K14 Lite పేరుతో భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
7000mAh భారీ బ్యాటరీ
K14 Liteకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం భారీ 7000mAh బ్యాటరీ. ఈ ఫోన్ Oppo A6c 4Gతో సమానమైన హార్డ్‌వేర్‌ను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. A6c 4Gలో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Unisoc T7250 చిప్‌సెట్, 4GB RAM, 128GB వరకు స్టోరేజ్ ఉన్నాయి. అలాగే 13MP వెనుక కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 15W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 7000mAh బ్యాటరీ ఉన్నాయి.
రూ.14 వేల ధరలో వచ్చే అవకాశం
Oppo A6c 4G ధర రూ.13,999 నుంచి ప్రారంభమైంది. దీంతో K14 Lite కూడా ఇదే తరహా ధరల శ్రేణిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే Oppo నుంచి అధికారిక ధర, ఫీచర్లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, Oppo భారత్‌లో 10,000mAh బ్యాటరీతో F35 Proను కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీంతో భారీ బ్యాటరీ ఫోన్లపై Oppo ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.