Family Relationships: మనుషులకు, జంతువులకు మధ్య ఉన్న ఒకే ఒక ఎలిమెంట్ సెంటిమెంట్. జంతువులకు అప్పుడప్పుడు సెంటిమెంట్ ఉంటుంది. అంటే ఒక ఆవు తన బిడ్డను కోల్పోతే ఏడ్చే తీరు.. ఒక కోతి తన పిల్లను నష్టపోతే విలపించే తీరు.. ఇవన్నీ కూడా జంతువులలో కూడా సెంటిమెంట్లు ఉంటాయి అని నిరూపిస్తాయి. కానీ మనుషులు అలా కాదు.. కోల్పోయినప్పుడు మాత్రమే.. కలిసి ఉన్నప్పుడు.. దూరమైనప్పుడు.. దూరంగా ఉండి దగ్గర అయినప్పుడు.. ఇలా అనేక సందర్భాలలో సెంటిమెంట్ ప్రదర్శిస్తూనే ఉంటారు. మనుషుల్లో సెంటిమెంట్ బయటపడినప్పుడు కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. ఉద్వేగం బయటపడుతూనే ఉంటుంది.
నేటి కాలంలో బంధువులు బంధుత్వాన్ని ప్రదర్శించడం లేదు. రక్తసంబంధం బలంగా ఉండడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ లో బంధుత్వాలు చిక్కుపోయిన తర్వాత.. ప్రతిదీ డబ్బుతో ముడి పడిన తర్వాత.. బంధం అనేది మిధ్య అయిపోయింది. బంధుత్వం అనేది ఒక మాయ అయిపోయింది.
కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు సాయం చేస్తామని ముందుకు రావడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం.. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భరోసాగా ఉంటామని చెప్పడం.. ఆ తర్వాత జారుకోవడం.. ఇలా అనేక సందర్భాలలో బంధువులు తమ అసలు రూపాన్ని బయటపెడుతూనే ఉంటారు. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమాల్లో చూపించినట్టు మనుషుల మధ్య బంధం గట్టిగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాలం మారినట్టుగానే మనుషుల మధ్య.. బంధాలు మారిపోయాయి. అనుబంధాలు పలచగా మారిపోయాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ప్రేమ అసలు లేదు. వాత్సల్యం కనిపించడం లేదు. జస్ట్ నటిస్తున్నారు అంతే..
ఈ కంటెంట్ కింది వీడియోలో ఒక జర్నలిస్టుకు ఇటువంటి అనుభవం ఎదురయింది. ఆయన తన ఆవేదనను బయట పెట్టుకున్నాడు. తన కుటుంబంలో ఒకరికి రోడ్డు ప్రమాదం జరిగితే.. బంధువులు ఆయనకు ఫోన్ చేశారు. ఒకతను డబ్బు సాయం చేస్తామని ముందుకు వచ్చాడు. కష్టకాలంలో 10000 ఇచ్చి.. తర్వాత మళ్లీ ఇద్దువు లేరా అన్నాడు. మరొకరు వచ్చి నీ స్థాయి పెరిగింది కదా.. నువ్వు మాతో ఎందుకు మాట్లాడతావు లేరా అన్నారు. మరొక మహిళ నీ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి కదా.. మీ బంధువుకు నయం చేయించు అని ఉచిత సలహా పడేసింది. మరొకరైతే ఆ ఇల్లు బాగాలేదు.. కొత్తది కట్టించు అని సూచించారు. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. కష్టాల్లో ఉన్న మనిషిని మరింత ఇబ్బంది పెట్టారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆ వ్యక్తి ఉదాహరణలతో బయట పెట్టడం నేటి కాలం నాటి పరిస్థితిని బయటపెట్టింది.. ఆయన చెప్పింది ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది.