Nimmala Ramanaidu: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటారు. చివరికి అనారోగ్యం సోకినా సరే పట్టించుకోరు. ఆయనకు ప్రజల దేవుళ్ళు. సమాజమే దేవాలయం. ఆయన పసుపు పార్టీకి వీర విధేయుడు. ఎంత అంటే.. చివరికి తన కూతురు వివాహంలో కూడా ఒంటిమీద పసుపు రంగు చొక్కాను వదిలిపెట్టలేదు.
నిత్యం ప్రజల్లోనే ఉంటూ రామానాయుడు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల బాగోగులు చూసుకుంటూ ఉంటారు. పాలకొల్లు ప్రాంతంలో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించడం మాత్రమే కాదు.. వరుసగా గెలుస్తూ అద్భుతమైన ఘనతలను తన పేరు మీద రాసుకున్నారు. పసుపు చొక్కాను ఏనాడు కూడా వదిలిపెట్టలేదు రామానాయుడు. తను ఏం పని చేసినా సరే.. ఎక్కడ ఉన్నా సరే ఆయన పసుపు రంగు చొక్కాను ధరించకుండా ఉండరు. చివరికి అంతటి చంద్రబాబునాయుడు కూడా.. రామా నాయుడు గురించి చెబుతూ.. టిడిపిలో అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా.. నాయకుడిగా రామానాయుడు పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. చివరికి తన కూతురు వివాహంలో కూడా పసుపు రంగు చొక్కాను వదిలిపెట్టలేదని గుర్తు చేశారు.
అప్పట్లో విజయవాడను వరదలు ముంచెత్తినప్పుడు రామానాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఆయన అంతటి అనారోగ్యంలోనూ విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదకు శాశ్వత పరిష్కారం చూపించారు. అప్పటికప్పుడు బండ్ నిర్మించారు. ఆ పనులను ఆయన అక్కడే ఉండి పర్యవేక్షించారు. చివరికి రామానాయుడు చొరవ చూసి లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. వీర విధేయ పసుపు కార్యకర్త లాంటి రామానాయుడు ఏనాడు కూడా పసుపు చొక్కాను వదిలిపెట్టలేదు. అయితే ఆయన జీవితంలో తొలిసారి పసుపు చొక్కాకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని రామానాయుడు దర్శించుకున్నారు. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రాన్ని సందర్శించిన నేపథ్యంలో.. రామానాయుడు తొలిసారి పసుపు రంగు చొక్కాను పక్కనపెట్టి.. గోధుమ వర్ణంలో పంచ.. ఒక చొక్కాను ధరించాల్సి వచ్చింది.. వాస్తవానికి రామానాయుడు ఇలా కనిపించడంతో మీడియా ప్రతినిధులు ఆసక్తి చూపించారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో గింగిరాలు కొడుతున్నాయి. రామానాయుడు పసుపు చొక్కా లేకుండా కనిపించడం ఇదే తొలిసారి అని.. పాలకొల్లు రాజకీయాలలో ఇదొక సంచలనమని టిడిపి కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.