Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకు అనకాపల్లి నుండి అమెరికా వరకు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ ఓపెనింగ్స్ ని చూస్తుంటే రవితేజ ఇంతకాలం ఎలాంటి స్టార్ డమ్ ని వృధా చేశాడో అర్థం అవుతోంది. నిన్న ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 36 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది రీజనల్ మూవీస్ లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు అని , కొన్ని పాన్ ఇండియన్ సినిమాలకు కూడా ఈ రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోలేదని అంటున్నారు. ఇక ప్రాంతాలవారీగా ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. కేవలం హైదరాబాద్ సిటీ లో మాత్రమే కాకుండా, నైజాం లోని ప్రతీ జిల్లాలో లోనూ కళ్ళు తిరిగే ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది ఈ చిత్రం. అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా సీడెడ్ నుండి 1 కోటి 58 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 1 కోటి రూపాయిలు , ఈస్ట్ గోదావరి నుండి 85 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 62 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 86 లక్షలు , కృష్ణా జిల్లా నుండి 65 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 17 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే 1 కోటి 3 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే విధంగా ఓవర్సీస్ నుండి దాదాపుగా 2 కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 14 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 20 కోట్ల రూపాయలకు మాత్రమే జరిగింది. అంటే ఇక కేవలం 6 కోట్ల 41 లక్షల రూపాయిలు వస్తే చాలు. రేపు మ్యాట్నీ షోస్ లోపు పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టబోతుంది ఈ చిత్రం. రవితేజ గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కి కనీసం ఫుల్ రన్ లో కూడా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాలేదు. అలాంటిది మొదటి రోజే దాదాపుగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టాడంటే, రవితేజ ఏ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు.