Shakeela: ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు షకీలా. ముఖ్యంగా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో ఈమె సినిమాలకు యువత బ్రహ్మరథం పట్టేవారు. ఈమె సినిమాల తాకిడి ని తట్టుకోలేక మమ్మూటీ, మోహన్ లాల్ సినిమాలు కూడా దెబ్బ తిన్నాయి. ఈమె సినిమా విడుదల అవుతుందంటే , వాళ్ళ సినిమాలు వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. అంతటి క్రేజ్ ఉండేది. అయితే శృంగార సినిమాలతో యువత ని షకీలా చెడగొడుతుంది అనే కారణం తో అప్పట్లో ఆమె సినిమాలను బ్యాన్ చేశారు. ఇది షకీలా కెరీర్ పై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ ని నెట్టుకొచ్చిన షకీలా, ఈమధ్య కాలం లో కనిపించకుండా పోయింది. అయితే రీసెంట్ గానే ఆమె గొంతుకి సర్జరీ జరిగింది.
గత కొంత కాలం క్రితం ఆమె గొంతులోని కొన్ని నరాలు చిట్లిపోయాయి. దీంతో ఆమె తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటూ వచ్చింది. రీసెంట్ గానే విజయవంతంగా గొంతు సర్జరీ ని పూర్తి చేసుకున్న ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఎంతో చలాకీ గా ఉండే షకీలాని ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితి లో చూసేలోపు నెటిజెన్స్ తీవ్రమైన విచారం వ్యక్తం చేశారు. అంతే కాదు ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడానికి గల కారణం కూడా వివరిస్తూ , యువత ని హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు గంటల తరబడి మొబైల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడే అలవాటు ఉంది. ప్రతీ రోజు రాత్రి బెడ్ మీద పడుకొని గేమ్స్ ఆడుకుంటూ , రీల్స్ చూడడం వల్ల నా ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎంతలా అంటే చూస్తున్నారు గా ఈరోజు నన్ను. సర్జరీ చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. అనుభవం తో చెప్తున్నాను, స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గించండి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఫోన్ ని అలవాటు చేయకండి’ అంటూ చెప్పుకొచ్చింది షకీలా.
ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. షకీలా చాలా కరెక్ట్ గా చెప్పింది. మొబైల్ ఫోన్ వాడకాన్ని సాధ్యమైనంత తొందరగా తగ్గించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు మొబైల్ ఫోన్ చేతుల్లో లేకపోతే అన్నం కూడా తినని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ నుండి మొబైల్ ఫోన్ దూరం చేస్తే , బ్రహ్మాండం బద్దలు అయిపోయేలా రేంజ్ లో గోల చేస్తుంటారు. ఇది మీలో చాలామందికి అనుభవం అయ్యుండొచ్చు. అందుకే మొబైల్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Actress #Shakeela Warns Against Excessive Smartphone Use After Neck Surgery
Veteran actress #Shakela recently underwent neck surgery after suffering severe nerve damage, which she attributed to prolonged smartphone use. She revealed that spending hours lying sideways in bed… pic.twitter.com/NwOcdru9qS
— Milagro Movies (@MilagroMovies) August 13, 2026