Shakeela: బిగ్ బాస్ షోలో పాల్గొనే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంటెస్టెంట్ లో షకీలా ఒకరు. తన ఆటతో బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసింది. ఒకప్పుడు తన అందంతో సినీ రంగాన్ని షేక్ చేసిన షకీలా.. బిగ్ బాస్ లో మాత్రం ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ రీసెంట్ గా ఓ అబ్బాయితో ఎంజాయ్ చేస్తున్న వీడియో మాత్రం తెగ వైరల్ గా మారింది. ఆ అబ్బాయి ఎవరో కాదు.. టేస్టీ తేజ.
బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు టేస్టీ తేజకు చాలా దగ్గరైంది షకీలా. దీంతో ఈయనకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఆమె చెప్పిన కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. తాను ఇప్పటికీ కేవలం కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పెళ్లి చేసుకోకుండా ఉందట. కానీ వారే తనను ఒంటరి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఒంటిరిగా మిగిలిందట షకీల. అయితే ఈమెకు 34 సంవత్సరాలు ఉండగానే తల్లిపోయిందట.
కుటుంబం కోసం సినిమాలు చేయమని చెప్పేదట షకీలా తల్లి. తల్లి చనిపోయిన కొన్ని రోజులకు అన్నయ్య చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు తానే తీసుకుందట. అయితే డబ్బులు కావాలి కానీ.. పిల్లలను ఇవ్వమన్నారట ఆమె వదిన. దీంతో అన్నయ్య పిల్లలు దూరం అయ్యారట. ఆ తర్వాత అక్క కూడా దూరం అవడంతో ఇప్పుడు తాను ఒంటరిగా మిగిలిపోయాను అంటూ బాధ పడింది.
ఇక ఈమె గురించి టేస్టీ తేజ మాట్లాడుతూ.. ఒక్కతే ఉంటున్నా.. ఎందరినో ఆదుకుంటుందని.. ట్రాన్స్ జెండర్లకు షెల్టర్ ఇవ్వడం, పెళ్లిళ్లు చేయడం, పోషించడం, తల్లిగా బాధ్యతలు స్వీకరించడం వంటివి చేస్తూ అందరిని ఆదుకుంటుందట షకీలా. అయితే ఎందరికో సహాయం చేస్తున్న ఈ మంచి మనసున్న షకీలా ఎప్పటికి ఒంటరి కాదని.. తనకు మేము ఉన్నాం అంటున్నారు అభిమానులు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Bigg boss shakeela revealed interesting things about her personal life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com