Dasari Narayana Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయనే విషయం మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సందర్భంలో దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకొని తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలతో సైతం సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు. ఇక ‘బండోడు – గుండమ్మ’ అనే సినిమా విషయంలో రాత్రికి రాత్రే అతను హీరోను మార్చేశాడంటూ ప్రముఖ దర్శకుడు నందం హరిచంద్ర రావు స్వయంగా వివరించారు. మ్యాటర్లోకి వెళ్తే దాసరి గారు ‘బండోడు గుండమ్మ’ సినిమాను జివిఎన్ రాజు ప్రొడ్యూసర్ గా కృష్ణంరాజుని హీరోగా పెట్టి స్టార్ట్ చేయాలనుకున్నాడు. 1980 ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా షూటింగ్ ను సైతం చెన్నై లోని అరుణాచలం స్టూడియో లో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయినప్పటికి కృష్ణంరాజు సైతం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ముహూర్తానికి మరో రెండు రోజుల సమయం ఉన్నప్పుడు కృష్ణంరాజు ఒక పెద్ద కండిషన్ అయితే పెట్టారట. ఆ కండిషన్ ఏంటంటే దాసరి గారితో బండోడు గుండమ్మ సినిమా నేను చేస్తాను. కానీ ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా కంటే ముందే బండోడు గుండమ్మ సినిమా ఫస్ట్ కాపీ వచ్చినా కూడా దాన్ని రిలీజ్ చేయకూడదని ఆ కండిషన్ కి మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానని చెప్పాడట. దానికి మీరు ఒప్పుకుంటే నేను సినిమా చేస్తాను. పూజ కార్యక్రమానికి వస్తానని చెప్పారట. ఈ విషయాన్ని జివిఎన్ రాజు కు చెప్పి నువ్వు ఎలా దాసరి గారితో చెప్తావో నాకు తెలియదు కానీ మొత్తానికైతే తనకి చెప్పి ఒప్పించే బాధ్యత నీదే అని చెప్పడంతో జివిఎన్ రాజు దాసరి గారి దగ్గరికి వెళ్లి జరిగింది జరిగినట్టుగా చెప్పాడు. దాంతో దాసరి గారు చాలా కోపానికి వచ్చారట. మన సినిమా ఫస్ట్ కాపీ వస్తే మనం మన సినిమాని ముందుగా రిలీజ్ చేసుకుంటాం. కానీ ఇంకొక సినిమా కోసం మన సినిమాను ఎందుకు పోస్ట్ పోన్ చేసుకుంటాం. అలా చేయడం వల్ల ఫైనాన్సర్లకు ఇచ్చే వడ్డీలు పెరిగిపోతాయి. ప్రొడ్యూసర్లపై భారం ఏర్పడుతుందని చెప్పారట. మొదటి నుంచి కూడా దాసరి గారు హీరోల పెత్తనాలను ఎప్పుడు సహించేవారు కాదు. వాళ్ళు ఏదైనా సినిమా మ్యాటర్ లోకి ఎంటరైతే సినిమాను ఆయన ఎప్పటికప్పుడు వారిని ఓవర్ కమ్ చేస్తూ వచ్చేవారట. ఇక ఈ విషయంలో కృష్ణం రాజు ఎంత చెప్పిన వినకపోతే సరికి మొత్తానికైతే దాసరి గారు ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. బండోడు – గుండమ్మ సినిమాలో కృష్ణంరాజుకు బదులుగా వేరే హీరోని పెడదామని జివిఎన్ రాజు కి చెప్పారట. దానికి ఏప్రిల్ 10వ తేదీన జరగాల్సిన ఓపెనింగ్ కార్యక్రమమైతే ఆగకూడదని ఆయన అనుకున్నాడట. ఎందుకంటే అప్పటికే చాలామంది సినిమా సెలబ్రిటీలకు ముహూర్తం జరుగుతుందని ఇన్విటేషన్ పంపించారు.
ఒకవేళ ఆ టైంకి ముహూర్తం జరగకపోతే తనకు అవమానం అని జివిఎన్ రాజు భావించారట. మొత్తానికైతే కృష్ణం రాజు ప్లేస్ లో వేరే హీరోని పెట్టి మనం ఈ మూవీ చేద్దాం అని దాసరిగారు చెప్పారట. ప్రొడ్యూసర్ రాజు కూడా చేసేదేమీ లేక దాసరి నిర్ణయానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో దాసరి గారు రాత్రికి రాత్రే ఆయన కృష్ణ గారితో మాట్లాడి బండోడు – గుండమ్మ సినిమా ను మీరు చేయాలని చెప్పారట.
దానికి కృష్ణ గారు సైతం కృష్ణంరాజు ఈ సినిమా చేస్తున్నాడు కదా అని కృష్ణ అడిగారట. దాంతో దాసరి గారు జరిగిందంతా కృష్ణ కి వివరించి చెప్పాడట. అలాగే మీకు నా మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ సినిమా చేయండి అని దాసరి గారు కృష్ణ గారిని అడిగారు. దాంతో కృష్ణ జరిగింది తెలుసుకొని మీ సినిమా నేను చేస్తున్నాను రేపు ముహూర్తానికి వస్తానని చెప్పి ఏప్రిల్ 10వ తేదీన ముహూర్తానికి వెళ్లి సినిమాలో హీరోగా తన పేరును వేయించుకున్నాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు దాసరి గారితో కొద్దిరోజులపాటు విభేదాలైతే పెట్టుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా దాసరి గారు రాత్రికి రాత్రే హీరోని మార్చడం అనేది అప్పట్లో ఒక పెను సంచలనాన్నీ క్రియేట్ చేసిందంటూ అప్పట్లో చాలా కథనాలైతే వెలువడ్డాయి. ఇక 1980 అక్టోబర్లో రిలీజ్ అయిన ‘బండోడు గుండమ్మ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా కలెక్షన్స్ ని సైతం భారీగానే తీసుకొచ్చింది…