Murali Dhar Goud: సినీ రంగం లో సెలబ్రిటీలు లగ్జరీ జీవితానికి బాగా అలవాటు పడి ఉంటారు. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా నేడు సొంత ఇల్లుని కొనుగోలు చేసి చేతికి లక్షల రూపాయిల విలువ చేసే వాచీలను పెట్టుకొని తిరుగుతారు. సాధారణమైన వాచీ ని పెట్టుకొని తిరిగినా ఒకే టైం చూపిస్తుంది , లక్షలు ఖర్చు చేసి చేతికి తొడుక్కున్న వాచీ కూడా ఒకే టైం చూపిస్తుంది, చివరికి కళ్ళకు ధరించే చెప్పులు , షూస్ ని కూడా లక్షలు పెట్టి కొంటున్నారు. ఇలా లక్షల రూపాయిల డబ్బుని వృధా చేయడం అవసరమా అని మన లాంటి వాళ్లకు అనిపించొచ్చు. కానీ సినీ సెలబ్రిటీ జీవితాన్ని గడుపుతూ కూడా , చాలా సింపుల్ గా జీవించే సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మురళీ ధర్.
ఈ పేరు చెప్తే మీరు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ , ఆ ఫోటో చూస్తే మాత్రం చిన్నపిల్లవాడు కూడా గుర్తుపట్టగలరు అనడంలో అతిశయోక్తి లేదు. అంత ఫేమస్ ఆయన. 2018 వ సంవత్సరం లో రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సంచలనాత్మక చిత్రం ‘రంగస్థలం’ లో ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఈయన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ , నేటి తరం ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ‘డీజే టిల్లు’ సిరీస్ లో హీరో సిద్దార్థ్ కొన్నలగడ్డ కి తండ్రిగా నటించి ఈయన బాగా ఫేమస్ అయ్యాడు. అంతే కాకుండా ‘మ్యాడ్’ సిరీస్ లో ‘లడ్డు’ కి తండ్రి పాత్ర పోషించి ఆడియన్స్ కి ఇంకా బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన దాదాపుగా ప్రతీ సినిమాలోనూ నటిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నారు.
చిన్నప్పటి నుండి సినిమాల మీద ఈయనకు పిచ్చి మక్కువ ఉండేది. కానీ కుటుంబాన్ని పోషించడం కోసం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ , అలా 30 ఏళ్ళు గడిపేశాడు. చాలా లేట్ వయస్సు లో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , అదృష్టం కలిసొచ్చి నేడు పెద్ద స్థాయికి చేరుకున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఒక యాంకర్ మురళి ధర్ గౌడ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ధరించే షూస్ ధర ఎంత’ అని అడగ్గా , నాకు నా షూస్ ధర ఎంతో తెలియదు అంటూ చెప్పుకోచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను ఈరోజు కోరింది కొనగల స్థాయిలో ఉన్నప్పటికీ , ఎందుకో నా మనసు హంగులు , ఆర్భాటాలు చేసుకోవడానికి ఒప్పుకోదు. లగ్జరీ జీవితం అంటే నాకు ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు మురళీధర్. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.