Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా వస్తుందంటే చాలు తన అభిమానుల్లో పూనకాలు మొదలవుతాయి. ఆయన ను స్క్రీన్ మీద చూస్తే చాలు ప్రతి ఒక్కరిలో హై వోల్టేజ్ కరెంటు అయితే పాస్ అవుతుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఈనెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు అనేది ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది… ఇక ప్రస్తుతం ఆయన కొత్త సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటికే సురేందర్ రెడ్డి చెప్పిన కథ ఇంకా ఫైనల్ కాలేదు. చర్చలు జరుగుతున్నప్పటికి మరో దర్శకుడు సైతం పవన్ కళ్యాణ్ కి కథనైతే వినిపించారట.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ తో ఇంతకుముందు ‘వకీల్ సాబ్’ సినిమా చేసిన వేణు శ్రీరామ్ కావడం విశేషం… వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలైతే చేసుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం అతనితో సినిమా చేస్తానని తనకు మాటిచ్చారట. అందువల్లే వేణు శ్రీరామ్ సైతం పవన్ కళ్యాణ్ ను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు.
ఇక తన కథ పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిందట. అయితే తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ మీద తీసుకెళ్లడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గత సంవత్సరం వేణు శ్రీరామ్ చేసిన ‘తమ్ముడు’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది.
ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు అంటే అతని మీద బజ్ క్రియేట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ కాంబినేషన్ ను సెట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పోయి పోయి మళ్లీ వేణు శ్రీరామ్ తో సినిమా ఎందుకు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…