Aadarsa Kutumbam Movie: విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ కాంబినేషన్ కి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ ని రాబట్టేంత సత్తా ఉంది. కానీ 10 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ సినిమాని కొన్న బయ్యర్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి ఫుల్ రన్ లో అయినా ఈ చిత్రం కనీస స్థాయి వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి , విడుదలకు ముందు ఎంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు నైజాం , ఓవర్సీస్ ప్రాంతాల్లో భారీ వసూళ్లు వస్తుంటాయి. కానీ ఈ చిత్రానికి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఆశించిన స్థాయి ఓపెనింగ్ దక్కలేదు. నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 48 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , సీడెడ్ ప్రాంతం నుండి 70 లక్షల రూపాయిలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 6 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 10 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 81 లక్షల రూపాయిల హైర్స్ ఉన్నాయట.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 3 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 10 కోట్ల 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 20 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి 63 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే 53 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను ఈ చిత్రం రాబోయే రోజుల్లో రాబట్టే అవకాశం ఉంది. ఈరోజు రేపు కలిపి ఓవరాల్ వరల్డ్ వైడ్ వీకెండ్ వసూళ్లు 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఉండొచ్చు. సోమవారం నుండి డీసెంట్ స్థాయి హోల్డ్ ని ఈ చిత్రం చూపించగలిగితే కచ్చితంగా హిట్ స్టేటస్ కి చేరుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి.