Rapthadu Incident: మానవత్వం సిగ్గుతో తలదించుకునే సంఘటన అది.. ఆ దృశ్యాలు చూస్తుంటే రక్తం మరి పోతుంది.. అనంతపురం జిల్లా రాప్తాడులో పదవ తరగతి విద్యార్థినిపై జరిగిన ఘోరం.. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయింది. ఎంతో భవిష్యత్తును ఊహించుకొని.. పాఠశాలకు వెళ్తున్న ఆ బాలిక మీద అత్యంత కర్కశంగా.. కర్కోటకంగా ఎలక్ట్రిక్ రంపంతో కోయడమే కాకుండా.. ప్రాణాలు తీయాలని చూసిన ఆ దుర్మార్గుడిని.. అసలు మనిషి అనకూడదని.. వాడు భూమి మీద బతకడం మానవజాతికి అవమానమని.. నెత్తుటి మడుగులో విలవిలలాడిన ఆ బాలిక వేదన చూస్తుంటే.. ఆ మూర్ఖుడి గుండె ఎంత రాతిదో అర్థమవుతుంది. ఇలాంటి మృగాలకు ఈ భూమ్మీద బతికే హక్కు లేదు. స్వేచ్ఛగా ఊపిరి తీసుకునే అవకాశం ఉండకూడదు. అసలు వాడు సమాజంలో ఉండడమే అత్యంత ప్రమాదం.
వాడు అంతకుమించి అనుభవించాలి
రంపంతో ఆ రాక్షసుడు ఆ బాలికను కోస్తుంటే ఎంతటి వేదన అనుభవించిందో.. రక్తం చిమ్ముతూ వస్తుంటే ఎంతటి వేదన చవిచూసిందో.. అంతకంటే ఘోరమైన శిక్ష వాడికి పడాలి.. ఎందుకు చేశాను రా అని క్షణక్షణం కుమిలి కుమిలి వాడు ఏడవాలి. కంటికి కన్ను మాత్రమే కాదు.. పంటికి పన్ను అనే సామెత తీరుగా జరిగిన దారుణానికి మించిన శిక్ష వాడికి పడాల్సిందే. మన చట్టాల్లో లొసుగులు అనేకం. సాంకేతిక అంశాలు కూడా నేరస్థులకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి అవకాశం వాడికి ఇవ్వకూడదు. మూడు పూటల భోజనం కాదు కదా కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వకూడదు. గాలి పీల్చుకునే అవకాశం కూడా వాడికి దక్కకూడదు. వాడికి పడేశిక్ష ఎలా ఉండాలి అంటే.. అసలు ఇంకొకసారి ఆడపిల్ల పై కన్నెత్తి చూసేందుకు ఎవరికైనా సరే కారిపోవాలి. నడిరోడ్డు మీద వాడికి పడే శిక్ష.. భవిష్యత్తులో చాలామంది కామందులకు.. ఉన్మాదులకు గుణపాఠం కావాలి.
ఆగడాలకు అడ్డు కట్ట ఏదీ
ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చింది. అయినప్పటికీ ఉన్మాదులు.. కామందులు తమ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రేమ పేరుతో.. కక్ష పేరుతో నడిరోడ్డు మీద ఆడపిల్లలను వేటాడుతున్నారు. ఇటువంటి దుర్మార్గులు ఉన్న సమాజంలో ఆడపిల్లల్ని బడికి లేదా కాలేజీకి పంపడానికి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. మన సమాజంలో ఆడపిల్లలు భద్రంగా ఉండాలి. అప్పుడే ఈ దేశం బాగుంటుంది. కానీ రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు మృగాళ్లు స్వైర విహారం చేస్తుంటే నిసాహంగా చూస్తూ ఉండిపోతున్నాయి. ఇది ఈ దేశానికి అతిపెద్ద ప్రమాదం. నేరం చేసిన వాడు ఎలాంటి వాడైనా సరే దయ చూపించొద్దు. జాలి చూపించొద్దు. క్షమిచరాని నేరం చేసిన వ్యక్తులకు అత్యంత వేగ.. అత్యంత కఠినమైన ముగింపు ఉండాల్సిందే. అదే ఆ బాలికకు ఈ సమాజం ఇచ్చే కనీస ఓదార్పు.
ఎన్నో చెబుతుంటారు
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కొంతమంది తెరమీదకి వస్తారు. మానవత్వం.. హక్కులు అంటూ కన్నీళ్లు కారుస్తుంటారు. కానీ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు అటువంటి వెధవలను ఏమాత్రం క్షమించకూడదు. మాటలు కట్టిపెట్టాలి. పట్టినమైన చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడే వ్యవస్థ తన విశ్వసనీయతను కోల్పోదు. ఒక ఆడపిల్ల శరీరాన్ని రంపంతో కోశాడు అంటే వాడిలో ఎంత క్రూరత్వం ఉంటుంది. వాటిలో ఎంత పైశాచికత్వం ఉంటుంది.. అటువంటి వ్యక్తులకు బతికే అవకాశం ఎక్కడిది. ఇటువంటి విష సంస్కృతి విస్తరిస్తే.. సమాజంలో ఆడపిల్లలు బతికి బట్ట కట్ట కలుగుతారా.. ఆడపిల్ల లేకపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది… అందువల్లే ఇటువంటి దుర్మార్గుల మీద మన న్యాయవ్యవస్థ.. పోలీసు వ్యవస్థ అత్యంత కఠినంగా ఉక్కు పాదాన్ని మోపాలి. ఆ దుర్మార్గుడికి దారుణమైన శిక్ష పడాలి. ఇంకొకడు అటువంటి దారుణానికి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. భయం ఎలా ఉండాలి అంటే కిలోలు, క్వింటాల్లో కాదు.. టన్నుల్లో ఉండాలి. ఆ చిన్నారి చిందించిన ప్రతి నెత్తుటి చుక్కకు జస్ట్టిఫికేషన్ జరగాల్సిందే. ఆడపిల్లల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాల్సింది ముమ్మాటికి ప్రభుత్వమే. ఎందుకంటే ఆ పాప వెళ్ళింది ప్రభుత్వ బడికి..
I am deeply shaken and enraged by the barbaric attack on a Class 10 student inside her classroom at Raptadu ZP High School. Attackers who target our young girls inside schools have no place in our society.
I am personally tracking her recovery and have directed the medical team to give her the highest priority care. I have ordered the police to hunt down the monster responsible and deliver the harshest legal punishment swiftly.
— N Chandrababu Naidu (@ncbn) October 31, 2026
I am deeply anguished and shocked by the brutal attack on a Class 10 student inside her school in Rapthadu, Anantapur district. Such an inhuman act against a young girl in a place meant for learning and safety is utterly reprehensible. Hon’ble CM @ncbn Garu has directed the police to take swift and stringent action against the perpetrator and ensure he is brought to justice. The safety and dignity of every girl and woman are paramount. Such acts of brutality will not be tolerated.
— Lokesh Nara (@naralokesh) October 31, 2026
రాప్తాడులో చిన్నారిపై జరిగిన దాడి అత్యంత బాధాకరం.ఈ ఘటనలో బాధ్యులెవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. బాధిత బాలికకు అండగా నిలబడి, మెరుగైన వైద్యం అందిస్తాం. ఆడబిడ్డల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవు. వారి భద్రత విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు!
#Rapthadu #JusticeForTheGirlChild #ChildSafety #WomenAndChildSafety #AndhraPradesh
— Anitha Vangalapudi (@Anitha_TDP) October 31, 2026