Top Web Series List: ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో సంచలనాత్మక చిత్రాలు వచ్చాయి , అదే సమయం లో అద్భుతమైన వెబ్ సిరీస్ లు కూడా వచ్చాయి. ముఖ్యంగా వెబ్ సిరీస్ లు చూసేందుకు జెన్ జీ ఆడియన్స్ అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు. అలా ఈ ఏడాది ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షించిన టాప్ 5 ఇండియన్ వెబ్ సిరీస్ లిస్ట్ ని IMDB సంస్థ విడుదల చేసింది. ఆ వెబ్ సిరీస్ లిస్ట్ ని ఒకసారి చూద్దాం.
ప్రీతమ్ & పెడ్రో :
జియో హాట్ స్టార్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అవినాష్ అరుణ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో అర్షద్ వార్సీ , వీర్ హిరానీ, విక్రాంత్, మోనా సింగ్ , బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిడ్నాప్ కి గురైన ఒక మినిస్టర్ కొడుకుని కాపాడేందుకు సైబర్ క్రైమ్ ఆఫీసర్ ఒక తెలివైన వ్యక్తితో చేతులు కలుపుతాడు. వీళ్లిద్దరు కలిసి ఎలా కిడ్నాప్ అయిన మినిస్టర్ కొడుకుని కాపాడుతారు అనేది ఆసక్తికరమైన పాయింట్. ఈ వెబ్ సిరీస్ ని మీరింకా చూడకపోయుంటే వెంటనే హాట్ స్టార్ లో చూసేయండి. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
సప్నే vs ఎవరీ వన్:
అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ అత్యధిక ప్రజాధారణ పొందిన రెండవ ఇండియన్ వెబ్ సిరీస్ గా నిల్చింది. అంబరీష్ వర్మ, పరమవీర్, విజయంత్ కోహ్లీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ కి అంబరీష్ వర్మ నే దర్శకత్వం వహించాడు. ఇద్దరు బలమైన కథానాయకులు , తమ లక్ష్యాలను చేరుకోవడానికి సమాజం లో ఎదురైనా కొన్ని సవాళ్ళను ఎలా ఎదురుకున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కేవలం హిందీ బాషలోనే అందుబాటులో ఉంది , తెలుగు ఆడియో లేదు.
రాఖ్:
అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ , అత్యంత ప్రజాధారణ పొందిన సిరీస్ లలో మూడవ స్థానంలో నిల్చింది. ఇది 1978 వ సంవత్సరం లో జరిగిన ఒక క్రైమ్ థ్రిల్లర్. అత్యంత దారుణంగా హత్యకి గురైన ఇద్దరు టీనేజర్స్ చుట్టూ ఈ కథ జరుగుతుంది. తెలుగు తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. ఇందులో అలీ ఫాజిల్ కథానాయకుడిగా నటించగా, సోనాలి బింద్రే , ఆమిర్ బషీర్ , ఆకాష్ మఖిజ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఏకాకి:
యూట్యూబ్ లోని ACV స్టూడియోస్ ఛానల్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ కేవలం హిందీ ఆడియో లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆశిష్ , ఆకాష్ , హర్ష రానే తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ కి ఆశిష్ స్వయంగా దర్శకత్వం వహించాడు.
తస్కరి:
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ కి నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఇండియన్ వెబ్ సిరీస్ లలో అత్యధిక వ్యూస్ ని సంపాదించుకున్న సిరీస్ ఇదేనట. హిందీ, తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ని ఇప్పటి వరకు చూడకపోతే వెంటనే చూసేయండి. ఒక నిజాయితీ గల కస్టమ్స్ అధికారి ముంబై లోని ఒక భారీ స్మగ్లింగ్ ని ఎలా అడ్డుకున్నాడు అనే అంశం పై ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.
IMDB విడుదల చేసిన ఈ టాప్ 5 వెబ్ సిరీస్ లలో మీకు బాగా నచ్చింది ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.