Homeఅంతర్జాతీయంUS Israel attacks in Middle East: మధ్య ప్రాచ్యానికి ఎందుకంత ప్రాధాన్యత? అమెరికా, ఇజ్రాయిల్...

US Israel attacks in Middle East: మధ్య ప్రాచ్యానికి ఎందుకంత ప్రాధాన్యత? అమెరికా, ఇజ్రాయిల్ ఎందుకు దాడులు చేస్తున్నాయి?

US Israel attacks in Middle East: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులతో మొదలైన యుద్ధం ఇప్పుడు భీకరమైన స్థాయికి చేరుకుంది. అనుకున్నట్టుగానే అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ని ఖతం చేసింది. దీంతో ఇరాన్ అట్టుడికి పోతోంది. ఇన్నాళ్లపాటు ఇబ్బందిపడిన వారంతా వీధులలోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు సిగరెట్ వెలిగించి ఖమేనీ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు . మాకు స్వేచ్ఛ లభించింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య దాడులతో మొదలైన […]

US Israel attacks in Middle East: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులతో మొదలైన యుద్ధం ఇప్పుడు భీకరమైన స్థాయికి చేరుకుంది. అనుకున్నట్టుగానే అమెరికా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ని ఖతం చేసింది. దీంతో ఇరాన్ అట్టుడికి పోతోంది. ఇన్నాళ్లపాటు ఇబ్బందిపడిన వారంతా వీధులలోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. కొందరు మహిళలు సిగరెట్ వెలిగించి ఖమేనీ దిష్టిబొమ్మలను తగలబెడుతున్నారు . మాకు స్వేచ్ఛ లభించింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య దాడులతో మొదలైన ఈ యుద్ధం.. ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడులు చేస్తూనే.. గల్ఫ్ దేశాలపై దాడులు మొదలుపెట్టింది. దీంతో ఒకసారి గా ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. వాస్తవానికి ఈ యుద్ధం మొత్తం మధ్య ప్రాచ్య దేశాల మధ్య కేంద్రీకృతం కావడంతో సరికొత్త చర్చ మొదలైంది.

మధ్య ప్రాచ్యం అనేది అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం. ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల మధ్యలో ఇది ఉంటుంది. ఈ ప్రాంతంలో పురాతన నాగరికత.. మతాలకు సంబంధించిన వ్యవహారాలు విలసిల్లాయి. మధ్య ప్రాచ్యం లోని పచ్చిమాసియా.. ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలలో చమురు అధికంగా ఉంటుంది. సహజవాయువు నిక్షేపాలు కూడా విస్తారంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చమురు మీద ఆధారపడి ఉంటుంది. భౌగోళికంగా పర్వతాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఎడారుడు కూడా అదే స్థాయిలో ఉన్నప్పటికీ.. సారవంతమైన లోయలు ఇక్కడ ప్రత్యేకతలు.. ఈ ప్రాంతాలలో యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

మధ్య ప్రాచ్యం లో కీలకమైన దేశాలుగా సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, యెమెన్, కువైట్, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయిల్, టర్కీ, లేబనాన్, జోర్డాన్, సిరియా ఉన్నాయి.. ప్రపంచంలోనే మొదటి నాగరికతగా పేరుపొందిన మెసోపటోమియా ఇక్కడ ఆవిర్భవించింది. సుయజ్, హోర్మోజ్ జలసంధులను ఈ ప్రాంతం నియంత్రిస్తూ ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక మొత్తంలో చమురు నిలువల్లో ఇక్కడే అధికంగా ఉన్నాయి. ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయి ఈ ప్రాంతాలకు ఉన్నది. అంతేకాదు ఇక్కడ అతనికి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ప్రాచీనమైన చరిత్ర.. చమురు.. సహజ వాయువులు అన్ని కలిసి ఇక్కడ అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. అందువల్లే ప్రపంచ రాజకీయాలు ఈ ప్రాంతాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి.. భవిష్యత్తు కాలంలో ఎటువంటి మార్పులు చోటు చూసుకుంటాయో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper