Homeఅంతర్జాతీయంWar cost per day 7000 crore rupees: యుద్ధానికి రోజుకు రూ.7 వేల కోట్లు.....

War cost per day 7000 crore rupees: యుద్ధానికి రోజుకు రూ.7 వేల కోట్లు.. నాలుగు వారాలు కొనసాగితే నష్టమే!

War cost per day 7000 crore rupees: అమెరికా–ఇరాన్‌ ఘర్షణలు పశ్చిమాసియాలో యుద్ధ ఆందోళనలను పెంచుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం.. మార్చి 3వ తేదీనాటికి తీవ్రరూపం దాల్చింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణించినా ఇరాన్‌ పోరాటంలో వెనక్కు తగ్గడం లేదు. ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. దీంతో ఈ యుద్ధం నాలుగు వారాలు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు.

ఆపరేషన్‌ ఎపిక్‌ ప్యూటీ పేరుతో..
ఫిబ్రవరి 28, 2026న అమెరికా పరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ పేరుతో అమెరికా ఇరాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్‌ ఆపరేషన్‌ లయన్‌ రోర్‌ పేరుతో ఇరాన్‌ లక్ష్యాలపై గగన, భూ, సముద్ర దాడులు చేసింది. ఇరాన్‌కు చెందిన 11 నౌకలు ధ్వంసమయ్యాయి. ఇరాన్‌ అణు కార్యకలాపాలను ఆపమని ట్రంప్‌ హెచ్చరించగా, ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలు, ఇజ్రాయెల్‌ స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది.

యుద్ధంలో 20కి పైగా ఆయుధ వ్యవస్థలు..
అమెరికా 20కి పైగా ఆయుధ వ్యవస్థలు ఉపయోగిస్తోంది, యుఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ వంటి వాహక నౌకలు మోహరించింది. ఇరాన్‌ హెజ్‌బొల్లా, ఇరాక్‌ మిలీషియాతో కలిసి డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది. అమెరికా వైపు 6 మంది సైనికులు మరణించారు, మూడు విమానాలు కూలాయి.

Also Read: ట్రాఫిక్‌ కెమెరాలు ట్రాక్‌ చేసి.. ఫోన్‌ ట్రాప్ చేసి.. ఖమేనీని ఖతం చేశారిలా..!

అమెరికాపై ఆర్థిక భారం..
యుద్ధం ప్రారంభించి5న తొలి 24 గంటల్లో అమెరికా 779 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7 వేల కోట్లు) ఖర్చు చేసింది. ముందస్తు యుద్ధ నౌకల మోహరింపునకు మరో 630 మిలియన్‌ డాలర్లు అంటే రోజుకు 6.5 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. ఇజ్రాయెల్‌ మద్దతుకు 21.7 బిలియన్, ఇతర ఆపరేషన్లకు 9–12 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది. మొత్తం 31–33 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది.

దీర్ఘకాల ప్రభావాలు
ట్రంప్‌ నాలుగైదు వారాలు యుద్ధం కనొసాగుతుందని ప్రకటించారు. అవసరమైతే భూదాడులు చేస్తామని ప్రకటించారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అమెరికాకు మద్దతు ప్రకటించాయి. అయితే అమెరికా వద్ద క్షిపణి రక్షణ వ్యవస్థలు పరిమితం, ఉక్రెయిన్, ఆసియాకు పంపించారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే నష్టాలు పెరిగి రక్షణ బడ్జెట్‌ 1.5 ట్రిలియన్‌ డాలర్లకు పెరగవచ్చు.

ఆయుధ నష్టాలు, సాంకేతిక లోపాలు ఆందోళనకరం. ఇరాన్‌ సైప్రస్, గల్ఫ్‌ లక్ష్యాలపై దాడులు పెంచుతోంది. జెనీవాలో పరోక్ష చర్చలు జరుగుతున్నా, యుద్ధం అనివార్యమని ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper