US Iran war latest news: పశ్చిమాసియా భగ్గుమంటోంది. మిస్సైళ్ల దాడులతో అట్టుడుకుతోంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేస్తుంటే ఇరాన్ గల్ఫ్‌దేశాలపై విరుచుకుపడుతోంది. యుద్ధం మొదలై 14 రోజులైనా ఇప్పటికీ ఎవరూ తగ్గడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా చంపేసింది. అయినా ఇరాన్ లొంగిపోవడం లేదు. ప్రతీకార దాడులతోపాటు ప్రపంచంలో ఆయిల్ సంక్షోభాన్ని సృష్టించేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ట్రంప్ యుద్ధం చివరి దశకు చేరుకుందని, అమెరికా విజయం సాధించిందని ప్రకటించారు. మరోవైపు ఇరాన్ అమెరికాకు అంత సీన్ లేదని ట్రంప్ ప్రకటనను కొట్టిపారేసింది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ చేసిన మరో ప్రకటనతో అమెరికాతోపాటు యావత్ ప్రపంచం ఉలిక్కపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్‌జీసీ) అమెరికా ప్రధాన క్యారియర్‌పై దాడి ప్రకటన చేసింది.
అబ్రహం లింకన్‌పై దాడి..
ఇరాన్ బలగాలు గల్ఫ్ ప్రాంతాలు, యుఎస్, ఇజ్రాయిల్ లక్ష్యాలపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్‌వింగ్‌లో భారీ నష్టం సంభవించిందని ఐఆర్‌జీసీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పొటోలను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. అబ్రహం లింకన్‌పై ఎలాంటి దాడీ జరగలేదని స్పష్టం చేసింది. ఐఆర్‌జీసీ నౌకలపై ప్రతిఘటన చర్యలతో ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతమైందని పేర్కొన్నారు.
Also Read: వార్ ఎఫెక్ట్.. టిఫిన్ ధరలకు రెక్కలు.. గ్యాస్ చార్జీ అదనం!
అబ్రహం లింకన్ విశేషాలు
అరేబియా సముద్రంలో మోహరించిన అతి పెద్ద అమెరికా క్యారియర్ అబ్రహం లింకన్. ఇరాన్ అణు చర్చల వైఫల్య సందర్భంగా రెండు మరింత నౌకలతో ప్రకటన. గత నెలలో అమెరికా–ఉక్రెయిన్ సంయుక్త అభియానాల ముందు పాపులర్ అయిన ఈ నౌక ప్రాంతీయ బెదిరింపును పెంచుతోంది.
ఇరాన్, అమెరికా విరుద్ధ ప్రకటనలు సైనిక ప్రవర్తన కంటే సమాచార యుద్ధాన్ని సూచిస్తాయి. ఇరాన్ దాడి వాదనలు దేశీయ మద్దతును పెంచుకోవడానికి, అమెరికా ఖండనం మిత్రరాజ్యాల ఆత్మవిశ్వాసాన్ని రక్షించడానికి ఉద్దేశించబడ్డాయి. వాస్తవాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
