Homeఅంతర్జాతీయంUS Iran tensions latest news: పట్టు వీడిన అమెరికా.. మెట్టు దిగని ఇరాన్‌..

US Iran tensions latest news: పట్టు వీడిన అమెరికా.. మెట్టు దిగని ఇరాన్‌..

US Iran tensions latest news: గల్ప్‌ యుద్ధం ప్రారంభమై 25 రోజులైంది. అమెరికా దాడులకు ఐదు రోజుల విరామం ప్రకటించింది. మూడు రోజులు గడిచాయి. అయినా ఇరాన మెట్టు దిగడం లేదు. ఆమేరకు సూచలను కూడా ఇవ్వడం లేదు. అమెరికానే మెట్టుదిగి విరామం ప్రకటించడం ఇరాన్‌ విజయంగానే భావించాలి. 25 రోజులు అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను ఎదుర్కొవడంతోపాటు అమెరికాకు స్థావరాలు ఇచ్చిన గల్ఫ్‌ దేశాలపై దాడలు చేస్తోంది. సీజ్‌ఫైర్‌ అని చెబుతున్న అమెరికా 15 కండీషన్లు […]

US Iran tensions latest news: గల్ప్‌ యుద్ధం ప్రారంభమై 25 రోజులైంది. అమెరికా దాడులకు ఐదు రోజుల విరామం ప్రకటించింది. మూడు రోజులు గడిచాయి. అయినా ఇరాన మెట్టు దిగడం లేదు. ఆమేరకు సూచలను కూడా ఇవ్వడం లేదు. అమెరికానే మెట్టుదిగి విరామం ప్రకటించడం ఇరాన్‌ విజయంగానే భావించాలి. 25 రోజులు అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను ఎదుర్కొవడంతోపాటు అమెరికాకు స్థావరాలు ఇచ్చిన గల్ఫ్‌ దేశాలపై దాడలు చేస్తోంది. సీజ్‌ఫైర్‌ అని చెబుతున్న అమెరికా 15 కండీషన్లు పెట్టింది. ఈ కండీషన్లకు ఇరాన్‌ అంగీకరించలేదు.

ఇరాన్‌ ఐదు కఠిన డిమాండ్లు
అణు కార్యక్రమానికి అడ్డంకులు తొలగించాలి. గల్ఫ్‌లో అమెరికా బేస్‌లు మూసివేయాలి. భవిష్యత్‌ దాడులు చేయమని హామీలు ఇవ్వాలి. హర్మూజ్‌ మార్గంపై సుంకాలు వసూలుకు అంగీకించాలి. హిజ్బుల్లా రక్షణకు ఇజ్రాయెల్‌ దాడులు ఆపాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది.

Also Read: హర్మూజ్‌ నుంచి ఆరు నౌకలు సేఫ్ గా ఇండియాకు.. మన ఎల్‌పీజీ కష్టాలు తీరినట్లే!

పాకిస్తాన్‌ మధ్యవర్తితం ఉత్తదే..
పాకిస్తాన్‌ చర్చలకు సిద్ధమైనా, ఇరాన్‌ పాక్‌ నౌకను అడ్డుకుని, ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలపై కోపం చూపింది. దీంతో పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వానికి అంగీకరించలేదు. టర్కీ మాత్రం సమాచారం బదిలీల ద్వారా మధ్యవర్తిత్వం చేస్తోంది; ఈజిప్ట్‌ కూడా సందేశాలు పంపుతోంది.

అమెరికా 15 షరతులతో సీజ్‌ఫైర్‌ ప్రతిపాదించినా, ఇరాన్‌ తిరస్కరణ యుద్ధాన్ని దీర్ఘకాలికంగా మార్చింది. ఇజ్రాయెల్‌ భద్రతా ఆందోళనలు, పాక్‌ చొరవలు క్లిష్టపరుస్తున్నాయి. ఏప్రిల్‌ మొదటి వారంలో టర్కీ సహాయంతో చర్చలు సాగితే శాంతి ఆవిష్కరణ కావచ్చు, లేకపోతే దాడులు ఊపందుకుంటాయి. రెండు దేశాలు బెట్టు వీడితే శాంతి నెలకొంటుంది. ఏప్రిల్‌ మొదటివారంలో చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper