Kalki 2 story changes: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘కల్కి 2’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. కల్కి మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో రెండో పార్ట్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయబోతుందనే నమ్మకం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కానీ ఇప్పుడు నాగ అశ్విన్ ఈ సినిమా కథని మార్చుతున్నట్టుగా వస్తున్నాయి. ఎందుకని ఆయన అలా మారుస్తున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ విషయం మీద సరైన క్లారిటీ రావడం లేదు కానీ మొత్తానికైతే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నారట… ఇక అతను అనుకున్నట్టుగానే ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని సాధించి 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
నాగ్ అశ్విన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఆయన చేసినవి మూడు సినిమాలే అయినప్పటికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బ్రేక్ చేసిన దర్శకులలో తను కూడా ఒకరు కావడం విశేషం…అలాగే తన వర్కింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా కూల్ గా తన సినిమాలను తాను చేసుకుంటూ ఎక్కడకూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ను చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు.
Also Read: సినిమాల కోసం కొత్త టీం ని ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఇక పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే..
అందువల్లే అతని సినిమాలకి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ దక్కుతుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోని సైతం కల్కి సినిమాలో డిఫరెంట్ గా చూపించిన ఘనత అతనికే దక్కింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతున్నాయట.
మొదటి పార్ట్ క్లైమాక్స్ లో ప్రభాస్ అమితాబచ్చన్ మధ్యలో వచ్చిన ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక అంతకు మించిన ఫైట్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయట. ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి ప్రభాస్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు…