Homeఅంతర్జాతీయంUK denies Trump Iran strike request: మీ ఇరాన్ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అమెరికాకు...

UK denies Trump Iran strike request: మీ ఇరాన్ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. అమెరికాకు యూకే షాక్‌!

UK denies Trump Iran strike request: వెనెజువెలాలో సైలెంట్‌ ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ట్రంప్‌ కండకావరం తలకెక్కింది. దీంతో తర్వాత గ్రీన్‌లాండ్‌ కబ్జాకు యత్నించాడు. యురోపియన్‌ యూనియర్‌ తిరగబడడంతో తాత్కాలికంగా తోక ముడిచాడు. ఇప్పుడు ఇరాన్‌పై దృష్టి పెట్టాడు. అణ్వస్త్రాలు తయారు చేస్తోందన్న సాకుతో దాడికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇరాన్‌ చుట్టూ నావికా దళాలను మోహరించాడు. వాయుసేనను సిద్ధం చేశాడు. మరోవైపు ఇరాన్‌తో అణు చర్యలు జరుపుతున్నాడు. ఇవి విఫలం అయితే దాడికి సిద్ధంగా ఉన్నాడు. […]

UK denies Trump Iran strike request: వెనెజువెలాలో సైలెంట్‌ ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ట్రంప్‌ కండకావరం తలకెక్కింది. దీంతో తర్వాత గ్రీన్‌లాండ్‌ కబ్జాకు యత్నించాడు. యురోపియన్‌ యూనియర్‌ తిరగబడడంతో తాత్కాలికంగా తోక ముడిచాడు. ఇప్పుడు ఇరాన్‌పై దృష్టి పెట్టాడు. అణ్వస్త్రాలు తయారు చేస్తోందన్న సాకుతో దాడికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇరాన్‌ చుట్టూ నావికా దళాలను మోహరించాడు. వాయుసేనను సిద్ధం చేశాడు. మరోవైపు ఇరాన్‌తో అణు చర్యలు జరుపుతున్నాడు. ఇవి విఫలం అయితే దాడికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో యూకే అమెరికాకు షాక్‌ ఇచ్చింది. తన కీలక బేస్‌ల వినియోగానికి అనుమతి జారీ చేయకపోవడం ట్రంప్‌కు సవాల్‌గా మారింది. ఫెయిర్‌ఫోర్డ్, డియాగో గార్సియా వంటి స్థావరాల నిషేధం మధ్యప్రాచ్య యుద్ధ వ్యూహాలను సంక్లిష్టం చేస్తోంది.

ఇరాన్‌తో అణు చర్చలు..
అమెరికా ఇరాన్‌ అణు కార్యక్రమం ఆపమని ఒత్తిడి పెంచుతుంది, చర్చలు విఫలమైతే దాడులు చేస్తామని బెదిరిస్తోంది. ట్రంప్‌ 10 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు, ఒప్పందం లేకపోతే యూకే భూభాగాల ద్వారా టెహ్రాన్‌ లక్ష్యంగా చేస్తామని సూచించారు. యుద్ధ నౌకలు, విమానాలు, సైనికుల తరలింపులు ఈ బెదిరింపును «ధ్రువీకరిస్తున్నాయి.

యూకే బేస్‌లపై నిషేధం..
స్విండన్‌ సమీపంలోని ఫెయిర్‌ఫోర్డ్‌ బేస్‌ నుంచి లాంగ్‌–రేంజ్‌ ఆపరేషన్లు, హిందూ మహాసముద్రంలో డియాగో గార్సియా నుంచి దాడులకు అమెరికా అనుమతి కోరగా, కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వం తిరస్కరించింది. గతంలో ఈ స్థావరాలను మధ్యప్రాచ్య దాడులకు ఉపయోగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ట్రంప్‌ అసంతృప్తిని మరింత పెంచింది. డియాగో గార్సియా తిరిగి అప్పగించాలనే యూకే నిర్ణయం ఈ సందర్భంలో మరింత ఉధృతం చేసింది.

అమెరికా సైనిక సన్నద్ధతలు
ఇదిలా ఉంటే ఇరాన్‌ వైపు భారీ సైనికులను మోహరిస్తోంది అమెరికా. ఏ క్షణంలోనైనా దాడి సూచనలు కనిపిస్తున్నాయని యూఎస్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్‌ ఈ బేస్‌ల ద్వారా దీర్ఘవ్యాప్తి దాడులు చేస్తామని చెప్పడం యూకేతో ఒత్తిడిని పెంచుతోంది. ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ ఆందోళనలను తీవ్రతరం చేస్తుంది.

యూకే నిషేధం అమెరికా వ్యూహాలను మార్చేలా చేస్తుంది, ఇరాన్‌పై ఒత్తిడి పెరిగినా దాడులు సాధ్యమైతే మాత్రమే. ఈ ఘర్షణ అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త చర్చలకు దారితీస్తుంది, మధ్యప్రాచ్య స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ట్రంప్‌ డెడ్‌లైన్‌ తర్వాత ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

 

 

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper