A Suitable Boy Web Series: కరోనా లాక్ డౌన్ తర్వాత ఓటీటీ లో వెబ్ సిరీస్ లకు మన ఆడియన్స్ బాగా అలవాటు పడ్డారు. కేవలం తెలుగు వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా, హిందీ, ఇంగ్లీష్, కొరియన్ ఇలా అన్ని భాషలకు అంబందింనచిన వెబ్ సిరీస్ లను కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలా నెట్ ఫ్లిక్స్ లో సంచలనం సృష్టించిన ఒక వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒక 29 ఏళ్ళ కుర్రాడు, 53 ఏళ్ళ మహిళతో రిలేషన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఏ సూటబుల్ బాయ్’. 2020 వ సంవత్సరం లో ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలు పెట్టింది. ఇందులో ఇషాన్ ఖత్తర్, సీనియర్ హీరోయిన్ టబు నటించారు .
Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!
ఇషాన్ ఖత్తర్ దఢక్ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా ద్వారానే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా వెండితెర కి పరిచయం అయ్యింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, ఇషాన్ ఖత్తర్ కి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. మరో పక్క వెబ్ సిరీస్ లు కూడా చేసాడు. రీసెంట్ గా ఆయన ఈ వెబ్ సిరీస్ తాలూకా అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ ఈ స్టోరీ చెప్పగానే మొదట్లో కాస్త భయపడ్డాను, ఎందుకంటే ఇందులో పాపులర్ హీరోయిన్ టబు ఉంటుంది కాబట్టి. ఆమెతో రొమాన్స్ అంటే మన స్థాయి సరిపోదు ఏమో అనుకున్నాను. కానీ సెట్స్ లోకి వెళ్లిన తర్వాత ఆమె నన్ను చాలా కంఫర్ట్ చేసింది. నాతో ఒక చిన్న అమ్మాయి లాగానే మాట్లాడేది. కానీ కెమెరా ఆన్ అవ్వగానే తన నట విశ్వరూపం చూపించేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ వెబ్ సిరీస్ ని ఒక పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఒక తల్లి తన కూతురు కి మంచి సంబంధం చూస్తూ ఉంటుంది. ఆ క్రమం లోనే వాళ్లకు హీరో పరిచయం అవుతాడు. హీరోతో సంబంధం కుదిరించుకున్న తర్వాత వాళ్లకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేమిటంటే హీరో కి 53 ఏళ్ళ మహిళతో సంబంధం ఉంది అని. అది తెలిసిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే స్టోరీ . ఆద్యంతం ఉత్కంఠ భరితంగా , ఆసక్తిగా ఈ సిరీస్ సాగిపోతాది . ఎవరైనా ఇప్పటి వరకు చూడకుండా ఉంటే వెంటనే నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.