India vs Pakistan : అంచనాలు తప్పలేదు. అద్భుతం చోటు చేసుకోలేదు. ఎప్పటిలాగే వారు ఆడారు.. మనవాళ్లు మొదటినుంచి పై చేయి సాధించారు. చివర్లో ఎటువంటి ఉత్కంఠకు తావు లేకుండా విజయం సాధించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ నిర్వహిస్తున్న మేజర్ టోర్నీలలో ఇదే జరుగుతోంది. ఆదివారం కూడా ఇదే జరిగింది. తద్వారా ఆసియా కప్ లో టీమ్ ఇండియా మరో విజయాన్ని అందుకొని.. సూపర్ – 4 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
️ Suryakumar Yadav: This win is a perfect return gift to India
Taking this moment to stand in solidarity with the families of Pahalgam victims. This win is dedicated to our brave armed forces Their courage will always inspire us.#INDvsPAK #AsiaCup pic.twitter.com/iwUeqV0zGE
— (@TheRealPKFan) September 14, 2025
127 పరుగులు మాత్రమే చేసింది
టాస్ గెలిచిన పాకిస్తాన్ ఈ మ్యాచ్లో 127 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు ప్రారంభం నుంచి చివరిదాకా అద్భుతంగా బౌలింగ్ వేశారు.. కట్టుదిట్టమైన బంతులు వేసి పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పరుగులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. కీలకమైన దశలో వికెట్లు తీస్తూ.. పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. 128 పరుగుల టార్గెట్ ను టీమిండియా ఈజీగా ఫినిష్ చేసింది. ఏమాత్రం ఇబ్బంది పడకుండా.. కేక్ వాక్ లాగా రన్ చేజ్ చేసింది.. నల్లేరు మీద నడక లాగా లక్ష్యాన్ని చేధించింది. 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి భారత్ గెలుపును అందుకుంది. ఈ గెలుపుతో ఆసియా కప్ లో టీమిండియా సూపర్ – 5 లోకి దర్జాగా ప్రవేశించింది. ప్రస్తుత ఆసియా కప్ లో ఈ ఘనత అందుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
This win is dedicated to the armed forces of India and the victims of the Pahalgam attack. Jai Hind pic.twitter.com/ueF1cev152
— Surya Kumar Yadav (@surya_14kumar) September 14, 2025
విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియా సారధి సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు..” నా పుట్టినరోజు సందర్భంగా పాకిస్తాన్ మీద 7 వికెట్ల తేడాతో గెలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గెలుపు మాకేంతో ప్రత్యేకం. ఈ విజయాన్ని పహాల్గం దాడిలో చనిపోయిన వారికి అంకితం ఇస్తున్నాం. భారత సైనికులకు ఈ గెలుపును కానుకగా ఇస్తున్నాం. నాడు జరిగిన ఉగ్రదాడిగా చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం. భారతీయుల మదిలో చిరునవ్వు మెదలడానికి కారణమయ్యే ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదులుకోబోము.” అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. పహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయిన వారి కుటుంబాలు భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది.