Homeఅంతర్జాతీయంPakistan: ఇస్లామాబాద్ నడిబొడ్డున లేపేసినా పాకిస్తాన్ కట్టుకథ అల్లింది.. నిజం తెలిసి పరువు పోయింది

Pakistan: ఇస్లామాబాద్ నడిబొడ్డున లేపేసినా పాకిస్తాన్ కట్టుకథ అల్లింది.. నిజం తెలిసి పరువు పోయింది

Pakistan: అబద్ధాలు ఆడినప్పటికీ అతికినట్టు ఉండాలని మన పెద్దలు అంటుంటారు. పాపం పాకిస్తాన్ దేశానికి అబద్ధాలు ఆడటం వచ్చు. కాకపోతే వాటిని అతికినట్టు చేయలేదు. అబద్ధాలు ఆడినంత సేపు పట్టదు అవి నిజాలని ప్రపంచానికి తెలియడానికి. అవి తెలిసినప్పటికీ పాకిస్తాన్ ఏమి చేయలేదు. ఎందుకంటే పరువు ఉన్న దేశం అయితే అలాంటి అబద్ధాలు ఆడదు. కానీ పాకిస్తాన్ దేశానికి పరువు.. మర్యాద వంటివి ఉండవు. కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. పైగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి […]

Pakistan: అబద్ధాలు ఆడినప్పటికీ అతికినట్టు ఉండాలని మన పెద్దలు అంటుంటారు. పాపం పాకిస్తాన్ దేశానికి అబద్ధాలు ఆడటం వచ్చు. కాకపోతే వాటిని అతికినట్టు చేయలేదు. అబద్ధాలు ఆడినంత సేపు పట్టదు అవి నిజాలని ప్రపంచానికి తెలియడానికి. అవి తెలిసినప్పటికీ పాకిస్తాన్ ఏమి చేయలేదు. ఎందుకంటే పరువు ఉన్న దేశం అయితే అలాంటి అబద్ధాలు ఆడదు. కానీ పాకిస్తాన్ దేశానికి పరువు.. మర్యాద వంటివి ఉండవు. కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయి. పైగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ దేశం.. అబద్ధాలు ఆడుతూనే ఉంటుంది. ప్రపంచం ముందు చులకన అవుతూనే ఉంటుంది. తాజాగా ఒక బలమైన సంఘటన జరిగింది.. అది కాస్త పాకిస్తాన్ దేశాన్ని మరింత నవ్వులపాలు చేసింది.

పాకిస్తాన్ దేశంలో ఇస్లామాబాద్ అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలకమైన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి కెప్టెన్ ఆసీమ్ తారీక్ ఇటీవల ఇస్లామాబాద్ ప్రాంతంలో తన కారులో ఉండగా చనిపోయారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద అవమానంగా మారింది. సైన్యానికి ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో దీని వెనుక ఒక కట్టుకథ అల్లడం మొదలుపెట్టింది. ఒక మహిళను రక్షించే క్రమంలో ఆసిమ్ వీరోచితంగా పోరాటం చేశారని.. చివరికి ఆయన చనిపోయారని అక్కడ మీడియాకు చెప్పింది అదే నిజమని భావించిన అక్కడ మీడియా వార్తలు రాసింది. పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆయనను హీరోగా చిత్రీకరించింది.

ఇది జరిగి 24 గంటలు కూడా కాకముందే.. తెహరిక్ ఏ తాలిబాన్ అనే సంస్థ తాము దాడికి పాల్పడినట్టు ప్రకటించింది. తమపై చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఈ హత్య చేశామని వీడియో సాక్షాలతో సహా బయట పెట్టింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం పరువు గాలిలో కలిసిపోయింది. ఇటీవల కాలంలో ఇస్లామాబాద్.. రావల్పిండి వంటి ప్రాంతాలలో వరుసగా దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని చంపేస్తున్నారు. పైగా వీడియోలతో సహా బయట పెడుతున్నారు. ఈ పని చేసింది తామే అంటూ స్పష్టం చేస్తున్నారు. అలాంటప్పుడు పాక్ ఎటువంటి కల్లబొల్లి కబుర్లు చెప్పినప్పటికీ ఉపయోగం ఉండడం లేదు. అల్లిన కట్టు కథలు నిలబడడం లేదు. ఇంకా ఇంకా అబద్దాలతో కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. వాస్తవాలు బయటికి రావడంతో పాకిస్తాన్ ఏం చేసినా సరే.. ప్రపంచ నమ్మడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper