Homeఅంతర్జాతీయంBlue Book protocol in Pakistan: పాకిస్తాన్‌లో ’బ్లూ బుక్‌’ ప్రొటోకాల్‌.. ఏంటి దీని రహస్యం!

Blue Book protocol in Pakistan: పాకిస్తాన్‌లో ’బ్లూ బుక్‌’ ప్రొటోకాల్‌.. ఏంటి దీని రహస్యం!

Blue Book protocol in Pakistan: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా సొంత సెక్యూరిటీని తీసుకెళ్తారు. సొంత వాహనాల్లోనే ప్రయాణిస్తారు. అంటే సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. తాజాగా పాకిస్తాన్‌లో అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆఫ్గాన్‌ దాడుల నేపథ్యంలో చర్చలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో బ్లూ బుక్‌ ప్రొటోకాల్‌ ఏర్పాట చేసింది.

ఏంటీ బ్లూ బుక్‌ ప్రొటోకాల్‌..?
పాకిస్తాన్‌ సైన్యం 1980ల్లో ఈ వ్యవస్థను రూపొందించింది. బెనజీర్‌ భుట్టో, పర్వేజ్‌ ముషార్రఫ్‌ వంటి నాయకులపై దాడులు, విదేశీ రాయబారులపై దాడులు తర్వాత దీన్ని బలోపేతం చేశారు. ’బ్లూ బుక్‌’ పేరు రహస్య డాక్యుమెంట్‌ నుంచి అందులో 100కుపైగా పేజీల డీటెయిల్డ్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ ఉన్నాయి. ఇది రెడ్‌ బుక్‌ (ప్రెసిడెంట్‌/ప్రైమ్‌ మినిస్టర్‌), గ్రీన్‌ బుక్‌ (ఇతర అధికారులు)తో పోలి అత్యున్నత స్థాయి.

అమలు విధానం…
బ్లూ బుక్‌ ప్రకారం ఫేజ్‌ 1లో 72 గంటల ముందు ఏరియా స్కాన్, ఐఈడీల క్లియరెన్స్, 5 కిలోమీటర్ల రేడియస్‌లో సీసీటీవీ, ఫేస్‌ రికగ్నిషన్‌ ఉంటుంది. ఫేజ్‌ 2లో హెలిక్యాప్టర్‌ ఎస్కార్ట్, అంబులెన్స్‌లు, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌లు, మొబైల్‌ జామర్లు 2 కిలోమీటర్ల వరకు సిగ్నలల్‌ జామ్‌ చేస్తుంది. ఫేజ్‌ 3లో స్నైపర్లు 500 మీటర్ల దూరం నుంచి కవర్‌ చేస్తారు. కవర్‌ ఫైర్‌ టీములు, డ్రోన్‌ సర్వెయిలెన్స్‌. రేంజర్స్‌ పీడెస్ట్రియన్‌ చెక్‌పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఫేజ్‌ 4లో డీబ్రీఫింగ్, ఇంటెల్‌ రిపోర్ట్‌లు ఉంటాయి. ఇందుకు మొత్త రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది.

ఈ ప్రొటోకాల్‌ ఏఐ,సైబర్‌ థ్రెట్‌లతో అప్‌గ్రేడ్‌ అవుతోంది. పాక్‌–భారత టెన్షన్లలో ఇలాంటి మీటింగ్‌లకు ఉపయోగపడవచ్చు. మొత్తంగా, ఇది పాక్‌ సైనిక డామినెన్స్‌ను ప్రతిబింబిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular