Homeఅంతర్జాతీయంPakistan Afghanistan war tensions: పసికూనపై యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్‌.. వాళ్లు తిరగబడితే..!

Pakistan Afghanistan war tensions: పసికూనపై యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్‌.. వాళ్లు తిరగబడితే..!

Pakistan Afghanistan war tensions: ప్రపంచంలో ఇప్పటికే ఉక్రెయిన్‌–రష్యా వార్‌ జరుగుతోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్‌ ప్రతీకార దాడులతో గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఈ యుద్ధాలతో ఇప్పటికే చమురు సంక్షోభం నెలకొంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ కూడా మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆఫ్గానిస్తాన్‌పై తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ టార్గెట్‌గా దాడులు చేస్తోంది. తాజాగా పూర్తిస్థాయి యుద్ధానికి ఇరు దేశాలు సిద్ధం అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. పరులపై […]

Pakistan Afghanistan war tensions: ప్రపంచంలో ఇప్పటికే ఉక్రెయిన్‌–రష్యా వార్‌ జరుగుతోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం చేస్తున్నాయి. ఇరాన్‌ ప్రతీకార దాడులతో గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఈ యుద్ధాలతో ఇప్పటికే చమురు సంక్షోభం నెలకొంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్‌ కూడా మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆఫ్గానిస్తాన్‌పై తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ టార్గెట్‌గా దాడులు చేస్తోంది. తాజాగా పూర్తిస్థాయి యుద్ధానికి ఇరు దేశాలు సిద్ధం అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి.

పరులపై మోర్టార్‌ దాడులు..
పాకిస్తాన్‌ సైన్యం కాబూల్‌ ప్రాంతాలపై మోర్టార్‌ దాడులు చేసిందని తాలిబాన్‌ ఆరోపించింది. ఆరుగురు మృతి చెందారని, 10 మంది గాయపడ్డారని పేర్కొంది. దీంతో ప్రతీకారంగా పాక్‌ సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఖైబర్‌ పఖ్తూంఖ్వా కోహాట్‌లో వైమానిక దాడితో పాక్‌కు భారీ నష్టం సంభవించిందని అఫ్గాన్‌ సమాచారం.

Also Read: అడోబ్ కు శాంతను నారాయణ్ రాజీనామా ఎందుకు? మధ్యలో సత్య నాదెళ్ల ఎంట్రీ మతలబు ఏంటి?

మిలిటెంట్‌ ఆరోపణలు..
కాందహార్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీప ఇంధన డిపోలపై పాక్‌ వైమానిక దాడి జరిగిందని అఫ్గాన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. మిలిటెంట్‌ కేంపులు, మౌలిక సదుపాయాలు లక్ష్యమని పాక్‌ చానెళ్లు చెప్పాయి. లక్కీ మార్వాత్‌లో పోలీసు వాహనంపై బాంబు పేలుడుతో ఆరుగురు అధికారుల మరణించారు. ఇది టీటీపీ పనే అని పాక్‌ భావిస్తోంది. తాలిబాన్‌ మిలిటెంట్లకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తోంది. ఇది బహిరంగ యుద్ధ హెచ్చరికలకు దారితీసింది.

సరిహద్దు వివాదాలు రెండు దేశాలను ఆర్థికంగా దెబ్బతీస్తాయి. దీని ప్రభావం భారతదేశం, మధ్యప్రాచ్యంపై పడుతుంది. శాంతి చర్చలు అవసరం. లేకపోతే ప్రాంతీయ యుద్ధం విస్తరించే ప్రమాదం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper