Nehal Modi Arrest: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో పరారీలో ఉన్న నీరవ్ మోడీ సోదరుడు నేహల్ మోడీని అమెరికాలో అరెస్టు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణంలో మరో నిందితుడిపై భారతదేశం పెద్ద విజయం సాధించిందనే చెప్పాలి. భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సంయుక్త అప్పీల్‌పై చర్య తీసుకున్న అమెరికా న్యాయ శాఖ జూలై 4న నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అరెస్టు చేసింది. భారత ప్రభుత్వం అప్పగించాలని చేసిన అభ్యర్థన మేరకు నేహాల్ మోడీని అరెస్టు చేశారు. ఇప్పుడు అతన్ని అమెరికాకు అప్పగించే చర్యలు ప్రారంభమయ్యాయి. అయితే అమెరికా ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నేహల్ మోడీ రెండు ఆరోపణల ఆధారంగా అప్పగింత ప్రక్రియను ఎదుర్కొంటున్నారు.
Also Read: ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య.. కారణం ఏంటంటే
పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్ మోడీ సోదరుడు నేహల్ మోడీని శుక్రవారం అంటే నిన్న అమెరికాలో అరెస్టు చేసినట్లు అమెరికా అధికారులు భారత ప్రభుత్వానికి తెలియజేశారు. భారతదేశంలోని రెండు ప్రధాన ఏజెన్సీలు, ఈడీ, సీబీఐ చేసిన అప్పగింత అభ్యర్థనల ఆధారంగా ఈ అరెస్టు జరిగింది. భారతదేశంలో జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాలలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నేహల్ మోడీ నిందితుడు. తన సోదరుడు నీరవ్ మోడీ కోసం నల్లధనాన్ని తెల్లగా చేయడంలో, దాచడంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడని దర్యాప్తులో తేలింది.
Also Read: కోహ్లీ 5 బౌలర్ల ఫార్ములానే హిట్.. గంభీర్-గిల్ ఆల్ రౌండర్ల ప్లాన్ ఫెయిల్!
నేహల్ మోడీ అనేక షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బును బదిలీ చేసినట్లు ED, CBI దర్యాప్తులో తేలింది. మోసపూరితంగా సంపాదించిన డబ్బును ట్రాక్ చేయకుండా ఉంచడమే అతని లక్ష్యం. ఇక జూలై 17, 2025 రోజున అమెరికా కోర్టులో స్టేటస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ రోజున నేహల్ మోడీ కూడా బెయిల్ దరఖాస్తు దాఖలు చేస్తారని భావిస్తున్నారు. కానీ అమెరికా ప్రభుత్వ న్యాయవాది దానిని వ్యతిరేకించే అవకాశమే ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు. నేహల్ మోడీని దేశ చట్టం ప్రకారం విచారించడానికి వీలుగా, వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొత్తం మీద ఈ అరెస్టు భారతదేశ దర్యాప్తు సంస్థలకు ఒక ముఖ్యమైన దశగా పరిగణిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.