Gautam Gambhir Decisions: వన్డేలో ప్రయోగాలు చేయొచ్చు. టి20 లోను ప్రయోగాలు చేయొచ్చు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి ప్రయోగాలు పనికిరావు. ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్ ఐదు రోజులపాటు జరుగుతుంది. ఈ ఐదు రోజుల్లోనూ ఆటగాళ్లు పూర్తి సన్నద్ధత, సామర్థ్యంతో ఉండాలి. ఏమాత్రం ఏకాగ్రత, లయను కోల్పోయినా అది జట్టు విజయాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. అందువల్లే టెస్ట్ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి ఏ జట్టు మేనేజ్మెంట్ కూడా ప్రయోగాలు చేయదు..ఒక్క ఇంగ్లాండ్ బజ్ బాల్ మినహా.. మిగతా జట్లేవి అంతగా ప్రయోగాలు చేయడం లేదు. మరి ఈ విషయాన్ని టీమ్ మీడియా మేనేజ్మెంట్ మర్చిపోయిందో.. గుర్తు లేనట్టు నటిస్తుందో తెలియదు కాని.. టెస్ట్ క్రికెట్లో ప్రయోగాలు చేస్తూ టీమిండియా విఫలమవుతోంది.
Also Read: కుల్ దీప్ ను ఆడించకపోవడం టీమిండియాకు బిగ్ మైనస్ అయ్యిందా?
ప్రస్తుతం ఇంగ్లీష్ గడ్డమీద టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయినప్పటికీ.. బౌలర్లు చేతులెత్తేశారు. వాస్తవానికి టీమిండియాలో ముగ్గురు పేస్ బౌలర్లు.. ఇద్దరు స్పిన్నర్లు ఉంటారు. ఈ ఐదుగురు బౌలర్ల ఫార్ములా టీమ్ ఇండియాకు టెస్ట్ క్రికెట్లో అనేక విజయాలను అందించింది. కొన్ని సీజన్లలో టీమ్ ఇండియాను టెస్ట్ ఫార్మాట్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపింది. ఈ విషయం ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ కి కూడా తెలుసు. ఒకప్పుడు ఇదే ఫార్ములా తో జట్టు టెస్ట్ క్రికెట్ ఆడినప్పుడు అతడు సభ్యుడు కూడా. కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా ప్రయోగాల పేరుతో.. స్పిన్ బౌలర్ల స్థానంలో ఆల్రౌండర్లను దించడం జట్టు విజయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్.. కంగారు గడ్డమీద జరిగిన బి జి టి సిరీస్.. ఇక ప్రస్తుత టెండూల్కర్ – అండర్సన్ సిరీస్ లో కూడా ఐదుగురు బౌలర్ల ఫార్ములాను గౌతమ్ గంభీర్ పక్కన పెట్టాడు. అందువల్లే భారత్ తొలి టెస్ట్ లో ఓటమిపాలైంది. అంతే కాదు గడచిన న్యూజిలాండ్, బీజీటీ సిరీస్ లో భారత్ ఓటమిపాలైంది. ఈ ఓటములతో డబ్ల్యూటీసీ ఫైనల్ లోకి ప్రవేశించలేకపోయింది.
తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో భారత్ రెండో టెస్టులో ఐదుగురి బౌలర్ల ఫార్ములాను అమలు చేస్తుందని అందరూ అనుకున్నారు. చైనా మన్ కులదీప్ యాదవ్ కు చోటు లభిస్తుందని భావించారు. కానీ వారందరి అంచనాలను మరోసారి గౌతమ్ గంభీర్ తలకిందులు చేశాడు. గౌతమ్ గంభీర్ నిర్ణయానికి తలవంచడమే గిల్ పని కాబట్టి.. అతడు కూడా ఏమీ అనలేకపోయాడు. అయిదుగురు బౌలర్ల ఫార్ములా లేకపోవడం వల్ల ఆ ప్రభావం రెండవ టెస్ట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో స్పష్టంగా కనిపించింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్రూక్, స్మిత్ ఏకంగా ఆరో వికెట్ కు 303 పరుగులు భాగస్వామ్యాన్ని నిర్మించారు. అది భారత జట్టు ఆధిక్యాన్ని అడ్డుకుంది. ఇంగ్లాండ్ పతనాన్ని దూరం చేసింది. ఇదే సమయంలో కులదీప్ యాదవ్ లేదా మరొక స్పిన్ బౌలర్ ఉంటే మ్యాచ్ స్వరూపం ఇంకో విధంగా ఉండేది.
Also Read: ముద్దు పెట్టుకున్నప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటారు?
ముందు చూపు లేకపోవడం.. సుదీర్ఘ ఫార్మాట్లో ప్రయోగాలు చేయకూడదనే విషయం తెలియకపోవడంతో భారత జట్టు దానికి తగ్గట్టుగా ప్రతికూల ఫలితాలను అందుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా కూడా గడిచిన ఫార్ములాను భారత మేనేజ్మెంట్ అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. గతంలో విరాట్ కోహ్లీ సారధిగా ఉన్నప్పుడు ఐదుగురు బౌలర్ల ఫార్ములాను అమలులో పెట్టేవాడు. అందువల్లే అతి ఆధ్వర్యంలో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్ళింది. అంతేకాదు అతడు సారధిగా ఉన్నప్పుడు టీమిండియా టెస్ట్ క్రికెట్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. టెస్ట్ విజయాలు కూడా అద్భుతంగా సాధించింది.