Prabhas donation Fish Venkat: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలతో తన రేంజ్ ను పెంచుకున్నాడు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అదే స్థాయిలో సాయం అందించడంలో వెనకడుగు వేయరు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో సంఘటనలు జరిగినా కోట్లల్లో ఆర్థిక సాయం అందించారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో. కొన్ని ప్రమాదకర ఘటనలకు లక్షల్లో విరాళం అందించారు కూడా. టాలీవుడ్ లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కామెడీ విలన్ ఫిష్ వెంకట్. ఈయన ఆరోగ్యం బాగలేదని కొన్ని వార్తలు వస్తున్నాయి.
Also Read: ఐశ్వరాయ్ తో విడాకులంటూ ప్రచారం.. అభిషేక్ రియాక్షన్ ఇదే
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగా లేదు. కొద్దిరోజులుగా ఆస్పత్రి బెడ్ పైననే ఉన్నారు. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందట. ఈ క్రమంలో ఆర్థిక సాయం కోరుతూ కుటుంబ వేడుకుంటుంది. ఈ సందర్బంలో ప్రభాస్ సాయం అందిస్తారంటూ వాళ్లకి కాల్ వచ్చిందని కానీ ఇంకా సాయం మాత్రం అందలేదంటూ సమాచారం. ఇక ఈ వార్తలపై తాజాగా ఫిష్ వెంకట్ కూతురు స్పందించింది.
హైదరాబాద్ లో 1971 ఆగస్టు 31న పుట్టారు ఫిష్ వెంకట్. బాల్యమంత మహానగరంలోనే గడిచింది. తనకు సినిమాలపై చాలా ఆసక్తి ఉండేది. అందుకే 2000 సంవత్సరంలో తొలిసారిగా వెండితెరపై కనిపించారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, వంటి ఎందరో స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. కామెడీ పాత్రలు, విలన్ పాత్రలు, మిగితా సపోర్టింగ్ రూల్స్ లో కూడా నటించి మెప్పించారు. ఏకంగా 25 ఏళ్లుగా టాలీవుడ్ లో తెలంగాణ యాస, భాషతో తన సత్తా చాటుతూ టాలీవుడ్ లో 100 చిత్రాల వరకు నటించారు.
గత 5 రోజుల నుంచి ఫిష్ వెంకట్ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషయంగానే ఉందని తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు, వైద్యలు. అయితే సరైన ఆర్థిక సాయం అందితే మాత్రం ఆయన ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉందట. కొన్నాళ్లుగా ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతూ ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీని కోసం ఆపరేషన్ అవసరం. అయితే ఖర్చు కూడా భారీగానే అవుతుందట.
Also Read: 175 రోజులు పూర్తి చేసుకున్న ‘డాకు మహారాజ్’.. ఎన్ని సెంటర్స్ అనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ నటుడి ఆరోగ్య పరిస్థితి తెలిసి ప్రభాస్ టీమ్ నుంచి కాల్ వచ్చిందట. ప్రభాస్ పీఏ అని చెప్పి ఎవరో ఫోన్ కాల్ చేశారట. అంతేకాదు ఏకంగా రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారని ఫిష్ వెంకట్ కూతురు చెప్పింది. అయితే తర్వాత రోజు కాల్ చేస్తే మాత్రం ఎత్తడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.