Daaku Maharaaj completed 175 days: ప్రస్తుత ట్రెండ్ లో ఒక సినిమా రెండు వారాలు థియేటర్స్ లో నిలబడి ఆడడమే గగనం అయిపోతుంది. అలాంటిది బాలయ్య(Nandamuri Balakrishna) సినిమాలు వంద రోజులు ఆడడమే కాకుండా, ఏకంగా 175 రోజులు ఆడేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్'(Daaku Maharaj) చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఓటీటీ లో కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సాధారణంగా బాలయ్య సినిమాలను పెద్దగా ఇష్టపడని యూత్ ఆడియన్స్ కూడా ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారు. సోషల్ మీడియా లో ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఎడిటర్స్ తమ అభిమాన హీరోలకు వాడుతూ అద్భుతమైన ఎడిట్స్ ని దింపడం వంటివి కూడా మనం ఇది వరకు ఎన్నో చూసాము. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
ఈ సినిమా నేటితో 175 రోజులు పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట లో ఉండే వెంకటేశ్వర థియేటర్ లో 175 రోజుల నుండి గ్యాప్ లేకుండా రోజుకి నాలుగు ఆటలు ప్రదర్శింపబడింది. అయితే ఇది నిజంగా ఆడిన సినిమా కాదని, అభిమానులు డబ్బులు కట్టి ఆడించారని పలువురు నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య సినిమాలకు ఇలాంటివి చేయడం కొత్త కాదని, గతంలో ఎన్నో సినిమాలను ఇలాగే ఆడించేవారని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, బాలయ్య సూపర్ హిట్ చిత్రాలన్నీ దాదాపుగా ఈ సెంటర్ లో 175 రోజులు ఆడాయి. ఇది ఒక అరుదైన రికార్డుగా ఆయన ఖాతాలో నమోదైంది. ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శితం అవుతూనే ఉంది. మరి మేకర్స్ 175 రోజుల వేడుక ని చిలకలూరి పేట లో చేస్తారా లేదా అనేది చూడాలి.
ఇకపోతే బాలయ్య ప్రస్తుతం తన కెరీర్ ని మలుపు తిప్పిన ‘అఖండ’ చిత్రం సీక్వెల్ ‘అఖండ తాండవం’ చిత్రం లో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలై ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిన ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా సెప్టెంబర్ 25 న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే ఆ డేట్ ని దాదాపుగా వదిలేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే CG వర్క్ అప్పటికి పూర్తి అవ్వదు, అంతే కాకుండా అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కూడా విడుదల అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు అన్ని ప్రాంతాల్లో బిజినెస్ క్లోజ్ అయిపోయింది. అఖండ 2 కి మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు. పైగా ఓటీటీ డీల్ కూడా ఇంకా జరగలేదు.