Homeఅంతర్జాతీయంIran America War: ఇరాన్ పది లక్షల సైన్యం.. అమెరికా 3,500 మందితో మోహరింపు.. మిడిల్...

Iran America War: ఇరాన్ పది లక్షల సైన్యం.. అమెరికా 3,500 మందితో మోహరింపు.. మిడిల్ ఈస్ట్ మరింత భయంకరం

Iran America War: యుద్ధం ముగిసింది అని అనుకుంటున్న వారికి.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయని భావిస్తున్న వారికి చేదువార్త. ఇప్పటికే గ్యాసరఫరా లేక.. చమురు అందక చాలావరకు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయి. ట్రంప్ వెనకడుగు వేయాలని.. ఇరాన్ పట్టింపులకు పోవద్దని.. ఇజ్రాయిల్ నిశ్శబ్దంగా ఉండాలని ప్రపంచ దేశాల అధినేతలు కోరుకుంటున్నారు. ప్రపంచం మొత్తం కోరుకుంటున్నట్టుగా అక్కడ పరిస్థితి లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతం మొత్తం దారుణంగా […]

Iran America War: యుద్ధం ముగిసింది అని అనుకుంటున్న వారికి.. ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరిగాయని భావిస్తున్న వారికి చేదువార్త. ఇప్పటికే గ్యాసరఫరా లేక.. చమురు అందక చాలావరకు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయి. ట్రంప్ వెనకడుగు వేయాలని.. ఇరాన్ పట్టింపులకు పోవద్దని.. ఇజ్రాయిల్ నిశ్శబ్దంగా ఉండాలని ప్రపంచ దేశాల అధినేతలు కోరుకుంటున్నారు.

ప్రపంచం మొత్తం కోరుకుంటున్నట్టుగా అక్కడ పరిస్థితి లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతం మొత్తం దారుణంగా మారిపోయింది. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ ఏకంగా 10 లక్షల సైన్యాన్ని గడిచిన 20 సంవత్సరాలలో తొలిసారిగా అమెరికా పశ్చిమ ఆసియా ప్రాంతంలో మోహరించింది. ఇది ఒక ప్రధాన పరిణామం అయితే.. సరిహద్దు ప్రాంతంలో దాడులను నివారించడానికి ఇరాన్ అదనపు బలగాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. దీనిపై అధికారికంగా ఇంతవరకు క్లారిటీ లేదు. పరవైపు అమెరికా ఆ ప్రాంతంలోనే 3500 మంది మెరైన్ లను సిద్ధంగా వచ్చినట్టు తెలుస్తోంది. అమెరికా కమాండ్ సెంటర్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం సుమారు 3,500 మంది నాయకులు, మెరైన్ లతో కూడిన ఒక మెరైన్ ఎక్స్ పెడిషనరీ యూనిట్.. రవాణా విమానాలు.. స్ట్రైక్ ఫైటర్లు.. ఉభయచర దాడి విభాగాలు.. వ్యూహాత్మకమైన ఆయుధాలను అమెరికా మోహరించినట్టు తెలుస్తోంది.

ఇరాన్, అమెరికా పూట పోటీగా తమ బలగాలను సమీకరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సమీప భవిష్యత్తులో భూతల దండయాత్ర జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దాడులకు సంబంధించి రెండు దేశాలు ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రణాళికలను బయటికి విడుదల చేయలేదు. మరోవైపు భూతలంలో దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ చెప్పింది. అంతేకాదు అమెరికా నుంచి ప్రతి దాడులు ఎదురైతే కాచుకుంటామని హెచ్చరించింది. ఈ ప్రకటనలను మొదట్లో అమెరికాను భయపెట్టడానికి ఇరాన్ చేస్తున్నట్టుగా అందరూ అనుకున్నారు. అయితే ఇరాన్ మాటలు మాత్రమే చెప్పడం లేదని.. అంతకుమించి అనే స్థాయిలో సైనికులను సిద్ధం చేసిందని ఇప్పుడు తెలుస్తోంది. ఇరాన్ కు ఇతర దళాలు కూడా తోడు కావడంతో అత్యంత బలంగా కనిపిస్తోంది. మొదట్లో ఇజ్రాయిల్.. అమెరికా దాడులకు భయపడిన ఇరాన్.. ఆ తర్వాత ప్రతి దాడులను మొదలుపెట్టింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే విధంగా అమెరికాపై.. ఇజ్రాయిల్ పై దాడులు చేసింది.

ఇరాన్ దాడులు.. ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మధ్య ఆసియా ప్రాంతంలో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధం నెల రోజులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం ఈ యుద్ధం ప్రభావాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవిస్తున్నది. చమురు, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి. కొన్ని దేశాలలో ఇంధనం లభించక అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. కొన్ని దేశాలైతే మొత్తంగా సెలవులు ప్రకటించాయి. ఈ క్రమంలో యుద్ధం మరో స్థాయికి వెళ్తున్న నేపథ్యంలో.. మిగతా దేశాలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper